ఏపీ మెడికల్ కోర్సుల ఫీజుల్లో సవరింపు
ఆంధ్రప్రదేశ్‌లో 2021-2023 విద్యాసంవత్సరానికి మెడికల్ కోర్సుల ఫీజుల్లో సవరణ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా ట్యూషన్ ఫీజు రూ. 15వేలకు పెంచారు. గతంలో ఇది రూ.12,155గా ఉంది. బీ కేటగిరి ఫీజు ఇప్పటివరకు రూ.13,37,057 ఉండగా ప్రస్తుతం రూ.12 లక్షలకు తగ్గించారు. గతంలో సీ కేటగిరి ఫీజు రూ. 33,07, 500 ఉండగా ప్రస్తుతం రూ.36 లక్షలుగా సవరించారు. సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజును రూ.15 లక్షలకు మార్చారు. కాగా మొత్తం […]
Written By:
, Updated On : November 6, 2020 / 10:39 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో 2021-2023 విద్యాసంవత్సరానికి మెడికల్ కోర్సుల ఫీజుల్లో సవరణ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా ట్యూషన్ ఫీజు రూ. 15వేలకు పెంచారు. గతంలో ఇది రూ.12,155గా ఉంది. బీ కేటగిరి ఫీజు ఇప్పటివరకు రూ.13,37,057 ఉండగా ప్రస్తుతం రూ.12 లక్షలకు తగ్గించారు. గతంలో సీ కేటగిరి ఫీజు రూ. 33,07, 500 ఉండగా ప్రస్తుతం రూ.36 లక్షలుగా సవరించారు. సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజును రూ.15 లక్షలకు మార్చారు. కాగా మొత్తం 17 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, 14 డెంటల్ కళాశాలకు ఈ ఫీజులు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.