‘వి’ పాయే.. ఓటీటీలో నెక్స్ట్ ఏంటీ?

కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే. దీంతో గతంలో పూర్తయిన సినిమాలన్నీ కూడా ఓటీటీలో రిలీజు చేసేందుకే నిర్మాతలు మొగ్గుచూపుతున్నారు. థియేటర్లో ఇప్పట్లో ఓపెన్ అయ్యేలా కన్పించకపోవడంతో నిర్మాతలు వడ్డీల భారాన్ని భరించలేక సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గత్యంతరలేకే నిర్మాతలు సినిమాలను ఓటీటీలు అడిగిన ధరకే కట్టబెడుతున్నట్లు తెలుస్తోంది. Also Read : గంగవ్వతో ‘బిగ్ బాస్’ ఆట.. చూడాల్సిందే..! నిర్మాతలు కూడా తమ సినిమాల కంటెంట్ అంతంత మాత్రంగానే […]

Written By: NARESH, Updated On : September 8, 2020 4:52 pm

Tollywood in ott

Follow us on

కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే. దీంతో గతంలో పూర్తయిన సినిమాలన్నీ కూడా ఓటీటీలో రిలీజు చేసేందుకే నిర్మాతలు మొగ్గుచూపుతున్నారు. థియేటర్లో ఇప్పట్లో ఓపెన్ అయ్యేలా కన్పించకపోవడంతో నిర్మాతలు వడ్డీల భారాన్ని భరించలేక సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గత్యంతరలేకే నిర్మాతలు సినిమాలను ఓటీటీలు అడిగిన ధరకే కట్టబెడుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : గంగవ్వతో ‘బిగ్ బాస్’ ఆట.. చూడాల్సిందే..!

నిర్మాతలు కూడా తమ సినిమాల కంటెంట్ అంతంత మాత్రంగానే ఉంటేనే ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. మంచి కంటెంట్ కలిగి ఉండి థియేటర్లలో కలెక్షన్లు కురిపిస్తుందని భావించిన నిర్మాతలు మాత్రం వెయిట్ చేసే ధోరణిలో ఉన్నారు. అయితే చిన్న సినిమాలకు మాత్రం ఓటీటీలు వరంగా మారాయి. చిన్న నిర్మాతలు ఓటీటీలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. అయితే పెద్ద సినిమాలకు మాత్రం ఓటీటీ వల్ల పెద్దగా గిటుబాటు అయ్యే పరిస్థితి లేదు. దీంతో వారంతా థియేటర్లనే నమ్ముకున్నారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో థియేటర్లకు జనం వచ్చే పరిస్థితులు లేకపోవడంతో పెద్ద సినిమాలు సైతం ఓటీటీల్లోనే సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి ఇప్పటికే అనేక చిన్న సినిమాలు ఓటీటీలో రిలీజై మంచి టాక్ సంపాదించుకున్నాయి. వీటితో ఓటీటీ నిర్వాహకులతోపాటు చిన్న నిర్మాతలు భారీగా ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. అయితే ఇటీవల టాలీవుడ్ నుంచి ఓటీటీలో రిలీజైన పెద్ద సినిమాగా ‘వి’ రిలీజై ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

‘వి’ సినిమా వల్ల ఓటీటీలకు ఏమేరకు లాభం వచ్చిందో తెలియదుగానీ ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయితే నిర్మాత భారీగా నష్టపోయేవాడనే టాక్ విన్పించింది. నిర్మాత దిల్ రాజు ‘వి’ సినిమాను ముందుగానే అంచనావేసి మంచి ధరకు ఓటీటీ విక్రయించి సేఫ్ అయ్యాడు. ఈ సినిమా ప్లాప్ టాక్ రావడంతో ఇక ఓటీటీ రానున్న సినిమాలపై అందరి దృష్టిపడింది. సాయిధరమ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’.. అనుష్క నటించిన ‘నిశబ్దం’ మూవీలు ఓటీటీలో రిలీజ్ అవుతారనే ప్రచారం జరుగుతోంది.

సాయిధరమ్ తేజ్ మూవీకి ఇంకా కొంత వర్క్ మిగిలివున్నట్లు తెలుస్తోంది. దీంతో నిశబ్ధం మూవీ ఓటీటీ ఈనెలాఖరు ఓటీటీ రానుందని.. ఈమేరకు చిత్రయూనిట్ తో ఓటీటీ నిర్వాహకులు డీల్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ‘నిశబ్ధం’ మూవీ ఓటీటీ వస్తుందో? రాదోననే ఆసక్తి అందరిలో నెలకొంది.