స్ఫూర్తినిస్తున్న ఐపీఎల్ పాట.. వింటే అదుర్స్?

కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడి ప్రస్తుతం యూఏఈ దేశంలో ఐపీఎల్ 13వ సీజన్ జరగబోతోంది. అయితే ఇప్పటికే చెన్నై జట్టులో 13మంది కరోనా బారిన పడి ఆ టీం మనోధైర్యం దెబ్బతింది. అయినా ఈ మెగా ఈవెంట్ కోసం ఆటగాళ్లు అంతా సిద్ధమయ్యారు. క్రికెట్ అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. Also Read : అంతర్వేది రథం ఆహుతి వెనుక కుట్ర ఎవరిది..? కరోనాను తట్టుకొని ఆటగాళ్లు ముందుకు రావడంతో బీసీసీఐ వారిలో స్ఫూర్తి నింపేందుకు […]

Written By: NARESH, Updated On : September 8, 2020 4:55 pm

Ipl 2020 theme song

Follow us on

కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడి ప్రస్తుతం యూఏఈ దేశంలో ఐపీఎల్ 13వ సీజన్ జరగబోతోంది. అయితే ఇప్పటికే చెన్నై జట్టులో 13మంది కరోనా బారిన పడి ఆ టీం మనోధైర్యం దెబ్బతింది. అయినా ఈ మెగా ఈవెంట్ కోసం ఆటగాళ్లు అంతా సిద్ధమయ్యారు. క్రికెట్ అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

Also Read : అంతర్వేది రథం ఆహుతి వెనుక కుట్ర ఎవరిది..?

కరోనాను తట్టుకొని ఆటగాళ్లు ముందుకు రావడంతో బీసీసీఐ వారిలో స్ఫూర్తి నింపేందుకు తాజాగా ముందడుగు వేసింది. కరోనాపై యుద్ధం చేస్తున్నామనే అర్థం వచ్చేలా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసంను నింపేలా ఓ అద్భుతమైన పాటను చిత్రీకరించారు.

తాజాగా బీసీసీఐ ఐపీఎల్ పై విడుదల చేసిన పాట దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ‘ఆయేంగే హమ్ వాపస్’ అనే లిరిక్స్ తో సాగిన ఈ పాట ఆసాంతం అభిమానుల రోమాలు నిక్కబొడిచేలా రూపొందడం విశేషం.

కరోనాపై విజయం సాధించి భారత్ లో మళ్లీ ఐపీఎల్ జరుగుతుందనే ఉద్దేశంతో కొత్తగా ఈ పాటను రూపొందించినట్టుగా తెలుస్తోంది. కాగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వరకు జరగబోయే ఈ సుధీర్ఘ పోటీలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తొలి మ్యాచ్ ఆడుతున్నాయి.

Also Read : గంగవ్వతో ‘బిగ్ బాస్’ ఆట.. చూడాల్సిందే..!