Tollywood: ప్రస్తుతం తెలుగులో ఉన్న సీనియర్ హీరోల పరిస్థితి ఏంటి..?

Tollywood: ప్రస్తుతం సీనియర్ హీరోలైన వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలు సైతం ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చే సినిమాలతో సూపర్ సక్సెస్ ని కొట్టి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు.

Written By: Gopi, Updated On : June 17, 2024 11:57 am

Venkatesh, Nagarjuna, Balakrishna, Chiranjeevi

Follow us on

Tollywood: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నంత సేపే హీరోలకు క్రేజ్ అనేది ఉంటుంది. ఇక కొన్ని ప్లాప్ లు వచ్చాయంటే క్రేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సక్సెస్ ఫుల్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం సీనియర్ హీరోలైన వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలు సైతం ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నారు.

కాబట్టి ఇప్పుడు వచ్చే సినిమాలతో సూపర్ సక్సెస్ ని కొట్టి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇక ఇప్పుడున్న స్టార్ హీరోలంతా పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేస్తుంటే వీళ్ళు మాత్రం తెలుగు లోనే వాళ్ల సినిమాలను చేస్తూ వాళ్ల స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగార్జున చేస్తున్న కుబేర సినిమాతో ఆయన పాన్ ఇండియా సినిమా చేస్తున్నప్పటికీ వెంకటేష్ లాంటి నటుడు మాత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమాని తెలుగుకే పరిమితం చేస్తున్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు.

Also Read: Mahesh Babu: హీరోయిన్స్ ని తలదన్నేలా మహేష్ బాబు మేనకోడలు… సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు

ఇక చిరంజీవి కూడా వాల్తేరు వీరయ్య సినిమాతో 200 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టినప్పటికీ ఆ తర్వాత చేసిన భోళా శంకర్ సినిమా భారీ డిజాస్టర్ ని మూట గట్టుకుంది. ఇక దాంతో ఇప్పుడు ఆయన చేస్తున్న విశ్వంభర సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఒక భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇక బాలయ్య బాబు మాత్రం వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్లను నమోదు చేసి ఇప్పుడు మరో హిట్ ని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

Also Read: Atlee: స్టోరీ మొత్తం ఫైనల్ అయ్యాక అల్లు అర్జున్ కి షాక్ ఇచ్చిన అట్లీ…ఏం జరిగిందంటే..?

ఇలా సీనియర్ హీరోలందరూ హిట్టు ఫ్లాప్ అనే సంబంధం లేకుండా భారీ సినిమాలను చేస్తున్నారు. అయితే వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ కొన్ని హిట్స్ కొడితేనే తప్ప మరికొన్ని ప్లాప్ లు వస్తే మాత్రం ఈ సీనియర్ హీరోల మార్కెట్ తగ్గి వీళ్ల కెరియర్ డైలమాలో పడే అవకాశాలైతే ఉన్నాయి…