https://oktelugu.com/

Mahesh Babu: హీరోయిన్స్ ని తలదన్నేలా మహేష్ బాబు మేనకోడలు… సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు

షో అనే ప్రయోగాత్మక చిత్రంలో మంజుల హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో కేవలం రెండు పాత్రలే ఉంటాయి. వారి మధ్య జరిగే డ్రామాను దర్శకుడు నీలకంఠ చక్కగా తెరకెక్కించాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : June 17, 2024 / 11:50 AM IST

    Mahesh Babu

    Follow us on

    Mahesh Babu: మహేష్ బాబు దేశంలోనే అందమైన హీరోల్లో ఒకరు. అమ్మాయిల కలల రాకుమారుడిగా ఆయన ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన మహేష్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. కాగా మహేష్ బాబుకు ఇద్దరు అక్కలు, ఒక చెల్లులు ఉన్నారు. వారిలో మంజుల ఘట్టమనేని ఒకరు. ఈమె తెలుగు ఆడియన్స్ కి పరిచయమే. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా పలు చిత్రాల్లో భాగమయ్యారు.

    షో అనే ప్రయోగాత్మక చిత్రంలో మంజుల హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో కేవలం రెండు పాత్రలే ఉంటాయి. వారి మధ్య జరిగే డ్రామాను దర్శకుడు నీలకంఠ చక్కగా తెరకెక్కించాడు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది. పలు అంతర్జాతీయ వేడుకల్లో ప్రదర్శించారు. అలాగే ఆరంజ్, సేవకుడు, మళ్ళీ మొదలైంది, హంట్, మంత్ ఆఫ్ మధు చిత్రాల్లో ఆమె నటించారు.

    పోకిరి, నాని, కావ్యాస్ డైరీ, ఏమాయ చేసావే వంటి చిత్రాలను మంజుల నిర్మించారు. ఆమె భర్త కూడా నటుడే. పలు చిత్రాల్లో ఆయన నటించారు. కాగా వీరికి ఒక అమ్మాయి సంతానం. పేరు జాహ్నవి స్వరూప్. మహేష్ మేనకోడలు అయిన జాహ్నవి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆమె అందానికి జనాలు ఫిదా అవుతున్నారు. మహేష్ మేనకోడలు అందంలో ఆయనకు పోటీ ఇస్తుంది. అచ్చు మేనమామ పోలికలే అంటున్నారు.

    జాహ్నవి హీరోయిన్ మెటీరియల్ అని కొనియాడుతున్నారు. ప్రస్తుతం టీనేజ్ లో ఉన్న అమ్మడు చదువు పూర్తి అయ్యాక నటన వైపు అడుగులు వేసే అవకాశం లేకపోలేదు. నిజంగా ఆమె సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయితే స్టార్ అవుతారని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సితార సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ దూసుకుపోతుంది. అప్పుడే సంపాదన కూడా మొదలెట్టేసింది. సితార ఓ యాడ్ చేసినందుకు రూ. 1 కోటి తీసుకున్నట్లు సమాచారం. కృష్ణ వారసులు సంచనాలు చేస్తున్నారు.