https://oktelugu.com/

Kantara 2: కాంతర 2 లో మరో కన్నడ స్టార్ హీరో… అంచనాలు పెంచుతున్న అప్డేట్…

Kantara 2: ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా నుంచి అప్పట్లో రిలీజ్ అయిన పోస్టర్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేసింది.

Written By:
  • Gopi
  • , Updated On : June 17, 2024 / 12:04 PM IST

    Kantara 2

    Follow us on

    Kantara 2: కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి కాంతార సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రిషబ్ శెట్టి ప్రస్తుతం ఆయన కాంతార 2 సినిమాని చేస్తున్నాడు. అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా నుంచి అప్పట్లో రిలీజ్ అయిన పోస్టర్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేసింది.

    అయితే దీనికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో అయిన యశ్ కూడా నటించబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఆయన ఎవరు అంటే కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న యశ్.. ఇక ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో ఆయన నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఆయన ఈ సినిమాలో నటించడం వల్ల కాంతర రేంజ్ అనేది మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయంటూ కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

    Also Read: Mahesh Babu: హీరోయిన్స్ ని తలదన్నేలా మహేష్ బాబు మేనకోడలు… సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు

    నిజానికి పాన్ ఇండియా సినిమాగా వస్తున్న కాంతార సినిమా ఒక ప్రభంజనాన్ని సృష్టించబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక కాంతార సినిమా ఎలాంటి సక్సెస్ అయితే సాధించిందో కాంతార 2 అంతకుమించి సూపర్ హిట్ అవ్వడమే కాకుండా భారీ కలెక్షన్లను కూడా వసూలు చేస్తుందంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాని ఎక్కడ తగ్గకుండా హై ఓల్టేజ్ గ్రాఫికల్ మూవీ గా తెరకెక్కిస్తున్నారట.

    Also Read: Atlee: స్టోరీ మొత్తం ఫైనల్ అయ్యాక అల్లు అర్జున్ కి షాక్ ఇచ్చిన అట్లీ…ఏం జరిగిందంటే..?

    ఇక సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో సత్తాని చాటుకుంటున్న హీరోల్లో రిషబ్ శెట్టి కూడా ఒకరు. ఇక ఇప్పుడు ఆయన ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు… కాంతార 2 సినిమా కూడా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధిస్తే రిషబ్ శెట్టి క్రేజ్ భారీగా పెరిగి తను కూడా ఇండియా లో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతాడు…