https://oktelugu.com/

Atlee: స్టోరీ మొత్తం ఫైనల్ అయ్యాక అల్లు అర్జున్ కి షాక్ ఇచ్చిన అట్లీ…ఏం జరిగిందంటే..?

మొత్తానికైతే ఆయన చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో 1500 కోట్ల వరకు కలెక్షన్లను రాబడుతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత అట్లీతో మరొక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : June 17, 2024 / 11:38 AM IST

    Atlee

    Follow us on

    Atlee: గంగోత్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్ ఈ సినిమా సక్సెస్ కొట్టినప్పటికి ఆయనకు స్టార్ డమ్ పరంగా ఈ సినిమా ఏమాత్రం క్రేజ్ అయితే తీసుకొచ్చి పెట్టలేదు. ఇక ఆ తర్వాత ఆర్య సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప 2 అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే తను భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

    ఇక మొత్తానికైతే ఆయన చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో 1500 కోట్ల వరకు కలెక్షన్లను రాబడుతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత అట్లీతో మరొక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇక దీనికి అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నాడు అనే న్యూస్ కూడా చాలా రోజుల నుంచి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం అల్లు అరవింద్ ఎన్ని కోట్ల బడ్జెట్ అయిన సరే పెట్టడానికి రెడీగా ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.

    ఇక దానికి తగ్గట్టుగానే డైరెక్టర్ అట్లీ కూడా ఆ కథని పూర్తిగా ఫైనలైజ్ చేసి అల్లు అర్జున్ కి వినిపించి ఓకే చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఏమైందో తెలియదు గానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా ఆగిపోయింది అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి కారణం ఏంటి అంటే డైరెక్టర్ అట్లీ రెమ్యూనరేషన్ విషయంలోనే ఈ సినిమా క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకుముందు బాలీవుడ్ స్టార్ హీరో అయిన షారుక్ ఖాన్ తో జవాన్ అనే సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్న అట్లీ..ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కోసం ఏకంగా 90 కోట్ల రూపాయలని రెమ్యూన రేషన్ గా అడిగినట్లుగా వార్తలైతే వస్తున్నాయి.

    ఇక అంత మొత్తంలో రెమ్యూన రేషన్ చెల్లించలేక అల్లుఅరవింద్ ఈ ప్రాజెక్టుని క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తుంది. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులే 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ లను తీసుకుంటున్న క్రమంలో అట్లీ 90 కోట్ల రెమ్యూనరేషన్ అడగడం అనేది సరైన విషయం కాదు అంటూ సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.