Kubera: సినిమా ఇండస్ట్రీలో మంచి టేస్ట్ ఉన్న దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు…ఈయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుడిని అలరిస్తూ ఉంటుంది. ఇక ఈయన ప్రస్తుతం ధనుష్ తో కుబేర అనే సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని మహాశివరాత్రి కానుకగా నిన్న రిలీజ్ చేశారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో నాగార్జున ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు అనే విషయం కూడా మనకు తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ధనుష్ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడు ఆయన క్యారెక్టర్ ఎంటి అనేదైతే రివిల్ చేశారు. ఇక దీనికి తగ్గట్టుగానే నాగార్జున క్యారెక్టర్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే నాగార్జున ఈ సినిమాలో ధనుష్ కి బ్రదర్ గా నటించబోతున్నాడట. ఇక ధనుష్ కి ఏ అవసరం ఉన్న వాళ్ల అన్నయ్యను అడుగుతాడట. ధనుష్ కి ఏం కావాలో అన్ని నాగార్జున నే దగ్గరుండి చూసుకునే విధంగా నాగ్ క్యారెక్టర్ ని తీర్చిదిద్దబోతున్నారట. ఇక దాంతో ధనుష్ నాగార్జున ఇద్దరూ బ్రదర్స్ గా ఈ సినిమాలో నటించి మెప్పించడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.
ఇక ఇదిలా ఉంటే తెలుగులో అంత మంది స్టార్ హీరోలు ఉండగా శేఖర్ కమ్ముల ధనుష్ తో ఈ సినిమా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ధనుష్ మాత్రం ఇప్పుడు ఎక్కువగా తెలుగు సినిమాల మీద ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. తమిళంలో ఆయనకు భారీ మార్కెట్ అయితే ఉంది. కానీ తెలుగులోనే కొద్దిగా మార్కెట్ అయితే ఏర్పడడం లేదు.
కాబట్టి మొన్న సార్ సినిమా తో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న ధనుష్ మళ్లీ కెప్టెన్ మిల్లర్ సినిమాతో భారీ ఫ్లాప్ ని అయితే మూట గట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాతో ఒక భారీ బ్లాక్ బాస్టర్ హిట్టును దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందుకే స్ట్రైయిట్ తెలుగు సినిమాలోనే నటిస్తున్నాడు. ఇక నాగార్జునతో కలిసి ఈసారి భారీ సక్సెస్ ని సాధించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…