https://oktelugu.com/

సినిమా పోకడ ఏమైపోతుందో.. !

సినిమాలకు ఒకప్పుడు లేని భరోసా.. ఇప్పుడు కొత్తగా ఏదైనా వచ్చి పడిందీ అంటే.. అది ఓటిటీల వ్యవహారమే. ఇప్పుడు ఏ సినిమా చేయాలన్నా.. ఎలాంటి నటీనటులను పెట్టాలన్నా, ఓటిటీలోని అభిరుచులను ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఓటిటీల క్రియేటివ్ హెడ్స్ అభిప్రాయాలకు ఆలోచనలకు తగ్గట్లుగానే సినిమాని తీయాలి. అల తీసిన సినిమాకి ఓటిటీ బిజినెస్ అదనపు ఆదాయం. కాకపోతే కరోనా పుణ్యమా అంటే.. ఇప్పుడు చిన్న సినిమాలుకు అదే మెయిన్ ఆదాయం అయిపొయింది. అందుకే ఎట్టిపరిస్థితుల్లో ఓటిటీ వారి మనో […]

Written By:
  • admin
  • , Updated On : August 5, 2020 11:39 am
    Follow us on


    సినిమాలకు ఒకప్పుడు లేని భరోసా.. ఇప్పుడు కొత్తగా ఏదైనా వచ్చి పడిందీ అంటే.. అది ఓటిటీల వ్యవహారమే. ఇప్పుడు ఏ సినిమా చేయాలన్నా.. ఎలాంటి నటీనటులను పెట్టాలన్నా, ఓటిటీలోని అభిరుచులను ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఓటిటీల క్రియేటివ్ హెడ్స్ అభిప్రాయాలకు ఆలోచనలకు తగ్గట్లుగానే సినిమాని తీయాలి. అల తీసిన సినిమాకి ఓటిటీ బిజినెస్ అదనపు ఆదాయం. కాకపోతే కరోనా పుణ్యమా అంటే.. ఇప్పుడు చిన్న సినిమాలుకు అదే మెయిన్ ఆదాయం అయిపొయింది. అందుకే ఎట్టిపరిస్థితుల్లో ఓటిటీ వారి మనో భావాలను దృష్టిలో పెట్టుకుని వాటికి అనుగుణంగానే సినిమాలను తీస్తున్నారు మేకర్స్. ఇంతవరకు బాగానే ఉంది.

    Also Read: పాపం రకుల్.. మొత్తం పోయేదాకా తెచ్చుకుంది !

    కానీ, ఈ మధ్య వస్తోన్న వెబ్ ఫిల్మ్స్ లో కాస్త హద్దులు మీరిన శృంగార తాలుకు బీభత్స రసం బాగా పొంగి పోర్లుతుందనేది సగటు ప్రేక్షకుడి అభిప్రాయం కూడా. ఇప్పుడు ఈ విధానం అన్ని సినిమాలకి అలవాటు అయ్యేలా ఉంది. ఓటిటిలకు తీసే వెబ్ ఫిల్మ్ లోనే కాక, థియేటర్స్ కోసం తీసే సాధారణ ఫిల్మ్స్ కి కూడా ఈ విధానం ఆనవాయితీగా మారేలా కనిపిస్తోంది. అయినా మహిళలను కించపరిచే అంశాలు.. వారి అందాలను హద్దు మీరి ప్రదర్సనలతోనే సినిమాలు బతుకుతాయి అనే దోరణి నిజమే అయితే.. భవిష్యత్తులో ఇంగ్లీష్ సినిమాలోని బిట్ సీన్స్ అన్ని.. ఇక తెలుగు సినిమాల్లో కూడా రెగ్యులర్ అయిపోతాయేమో. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా మారకుండా ఉండాలంటే ప్రేక్షకుల టేస్ట్ మారాలి. వాళ్ళు మంచి సినిమాలనే ఆదరించాలి.

    Also Read: క్రేజీ ఆఫర్ కొట్టేసిన మహేశ్‌ హీరోయిన్‌!

    అయినా ఒటిటి మాత్రం నిర్మాతలకు ఓ పెద్ద ఊరట.. దీనిలో సినిమాని రిలీజ్ చేయడానికి ఎదురు డబ్బులు కట్టే పని లేదు, ఏ దిల్ రాజు లాంటి వ్యక్తీ చుట్టూ తిరగే పని లేదు. పైగా వారికి ఈ ప్లాట్ ఫామ్ సంబంధించినది కాదు. ఇక ఏం తీసినా ఎవరి గురించి తీసినా మాస్ హడావుడి, గొడవలు పెట్టేంత వ్యవహారం అసలే ఉండదు. మొత్తానికి ఆన్ లైన్ లో వెబ్ మూవీ చేయడం మంచి ఆప్షన్ లాగే ఉంది చిన్న నిర్మాతలకు. కాకపోతే బోల్డ్ అండ్ క్రైమ్ సినిమాలనే హద్దులు దాటి తీస్తే.. సినిమా పోకడే ఏమైపోతుందో..!