https://oktelugu.com/

తెలుగు డైరెక్టర్ తో మరో బాలీవుడ్ స్టార్ !

‘అర్జున్ రెడ్డి‘ లాంటి బోల్డ్ సినిమాని రెండు ప్రధాన భాషల్లో తీసి తనకంటూ సొంత మార్కెట్ తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ వంగ. నిజానికి అర్జున్ రెడ్డికి ముందు సందీప్ పరిస్థితి అసిస్టెంట్ డైరెక్టర్ కి కూడా తక్కువే. అలాంటి స్థితి నుండి ఒక్కసారిగా ఒక్క సినిమాతో నేషనల్ డైరెక్టర్ రేంజ్ గుర్తింపు తెచ్చుకోవడం అంటే.. టాలెంట్ కంటే ముందు అదృష్టం ఉండాలి. లేకపోతే హిందీలో ‘కబీర్ సింగ్’ లాంటి సినిమాలు చాలా వచ్చాయి. అలాంటిది ఈ రీమేక్ […]

Written By:
  • admin
  • , Updated On : August 5, 2020 / 12:31 PM IST
    Follow us on


    అర్జున్ రెడ్డి‘ లాంటి బోల్డ్ సినిమాని రెండు ప్రధాన భాషల్లో తీసి తనకంటూ సొంత మార్కెట్ తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ వంగ. నిజానికి అర్జున్ రెడ్డికి ముందు సందీప్ పరిస్థితి అసిస్టెంట్ డైరెక్టర్ కి కూడా తక్కువే. అలాంటి స్థితి నుండి ఒక్కసారిగా ఒక్క సినిమాతో నేషనల్ డైరెక్టర్ రేంజ్ గుర్తింపు తెచ్చుకోవడం అంటే.. టాలెంట్ కంటే ముందు అదృష్టం ఉండాలి. లేకపోతే హిందీలో ‘కబీర్ సింగ్’ లాంటి సినిమాలు చాలా వచ్చాయి. అలాంటిది ఈ రీమేక్ సినిమాని భారీ బ్లాక్ బస్టర్ చేయడం ఏమిటి. ఏమైనా సందీప్ అక్కడ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.

    Also Read: క్రేజీ ఆఫర్ కొట్టేసిన మహేశ్‌ హీరోయిన్‌!

    ఇప్పుడు సందీప్ రెడ్డి సినిమాకి నిర్మాతలు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ముందుకొస్తున్నారంటే అది ‘కబీర్ సింగ్’ ఇచ్చిన నమ్మకమే. కాగా సందీప్ తన తరువాత సినిమాని అర్జున్ కపూర్ తో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే అర్జున్ కి కథ కూడా చెప్పాడట. అర్జున్ కపూర్ కూడా సినిమా చేయడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కరోనా అనంతరం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాని నిర్మాత టీ-సిరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతాని కలిసి భారీ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. నిజానికి సందీప్ కి ఇది బెస్ట్ ప్రాజెక్ట్.. మళ్లీ వంద కోట్ల సినిమా ఖాయంలా కనిపిస్తోంది.

    Also Read: రానా- మిహీకా పెళ్లి.. కండిషన్స్‌ అప్లై!

    కాగా ఈ సినిమాకి సందీప్ సోదరుడు, ‘అర్జున్ రెడ్డి’ నిర్మాత ప్రణయ్ వంగ కూడా చిత్ర నిర్మాణంలో పాలుపంచుబోతున్నాడు. మరి పాన్ ఇండియా సినిమా.. పైగా స్టార్ హీరో.. అన్నిటికి మించి మినిమమ్ గ్యారెంటీ మూవీ. అందుకే ప్రణయ్ ఈ సినిమా నిర్మాణం పై ఆసక్తిగా ఉన్నాడట. ఇక ఈ సినిమా క్రైమ్ డ్రామాగా ఉండబోతోందని.. అలాగే సినిమాలో కొంతభాగం పిరియాడిక్ నేపథ్యంలో సాగుతోందని తెలుస్తోంది. ఏమైనా సందీప్ వంగ సినిమాలు భిన్నంగా ఉన్నా లేకపోయినా మంచి మసాలా కంటెంట్ ఉంటుంది