https://oktelugu.com/

అయోధ్యలో భూమి పూజపై.. రావణ గుడి పూజారి ఏమన్నారంటే?

హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు.. ఆయనను మనసారా కొలువని హిందువు ఉండడంటే అతిశయోక్తి కాదేమో.. దేశంలోని రామాలయం లేని ఊరు.. విధి ఉండాదు.. అలాంటిది రామ జన్మభూమి అయోధ్యలో రామాలయం లేదనే చింత దేశప్రజల్లో ఉండేది. అయితే దశాబ్దాలుగా రామాలయం నిర్మాణంలో నెలకొన్న స్తబ్ధత నేటి భూమిపూజతో వీడనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో నేడు రామలయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30గంటల నుంచి 12.45మధ్యలో భూమిపూజ కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే ప్రధాని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 5, 2020 / 11:31 AM IST
    Follow us on


    హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు.. ఆయనను మనసారా కొలువని హిందువు ఉండడంటే అతిశయోక్తి కాదేమో.. దేశంలోని రామాలయం లేని ఊరు.. విధి ఉండాదు.. అలాంటిది రామ జన్మభూమి అయోధ్యలో రామాలయం లేదనే చింత దేశప్రజల్లో ఉండేది. అయితే దశాబ్దాలుగా రామాలయం నిర్మాణంలో నెలకొన్న స్తబ్ధత నేటి భూమిపూజతో వీడనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో నేడు రామలయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30గంటల నుంచి 12.45మధ్యలో భూమిపూజ కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే ప్రధాని అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. ఇదిలా ఉంటే అయోధ్యలో భూమిపూజపై రావణ గుడి పూజారి ఆనందం వ్యక్తం చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

    Also Read: అక్కడ బీజేపీ ఆకర్ష్ మొదలెట్టిందా?

    అయోధ్యలో శ్రీరాముడి ఆలయం భూమిపూజపై రావణ గుడి పూజారి మహంత్ రామదాస్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. శ్రీరాముడికి అయోధ్య ఎలాగో.. రావణుడికి బిస్ రాక్ అలాంటిదేనని ఆయన అన్నారు. అయోధ్యకు దాదాపు 650కిలోమీటర్ల దూరంలోని గౌతమ్ బుద్ద నగర్ జిల్లాలో బిస్ రాస్ అనే గ్రామం ఉందని తెలిపారు. బిస్ రాక్ రావణుడి జన్మ స్థలమని ఇది గ్రేటర్ నోయిడాకు పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలోని రావణ గుడిలో తాను విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు అయోధ్యలో రామాలయ భూమి పూజ అనంతరం తాను అందరికీ స్వీట్లు పంచుతానని చెబుతున్నారు.

    రాముడికి బద్ధవిరోధి అయిన రావణుడి గుడి పూజారి ఇలా కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు ఆయన పలు కారణాలను వివరిస్తున్నారు. ‘అయోధ్యలో భూమి పూజ జరుగుతున్నందుకు.. అక్కడ గొప్ప ఆలయ నిర్మాణించబోతున్నందుకు.. నాకు చాలా సంతోషంగా ఉంది.. రావణుడు లేనిదే ఎవరికీ రాముడి గురించి తెలియదు.. అలాగే రాముడు లేకపోతే రావణుడిని కూడా ఎవరూ పట్టించుకునేవారు కాదు.. అని రామదాస్ చెప్పుకొచ్చారు. అదేవిధంగా రావణుడు గొప్ప జ్ఞానవంతుడు.. ఎన్నో కళల్లో నిష్ణాతుడని.. సీతను అపహరించుకొని వెళ్లాక ఆయన తన భవనానికి తీసుకుని వెళ్లకుండా అశోక వనంలో ఉంచాడని.. అలాగే ఆమెకు కాపలాగా స్త్రీలనే ఉంచాడని తెలిపారు.

    Also Read: ఆస్పత్రుల కరోనా దోపిడీ.. చోద్యం చూస్తున్న కేసీఆర్?

    ఇక శ్రీరాముడి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఆయన ఎన్నో గొప్ప గుణాలున్న సుగుణాభిరాముడని కొనియాడారు. రాముడిలాగే రావణుడిలోనూ చాలా మంచి లక్షణాలున్నాయని రావణుడిపై తన భక్తిని చాటుకున్నాడు రామదాస్. ఇక తాను పూజారిగా విధులు నిర్వహిస్తున్న బిస్ రాక్ లోని రావణుని గుడిలో శివపార్వతులు, కుబేరుల విగ్రహాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇక్కడికి వచ్చే భక్తులు శివపార్వతులు, కుబేరులతోపాటు రావణుడిని కూడా పూజిస్తారని తెలిపారు. ఈ ఆలయానికి వచ్చే భక్తుల్లో 20శాతం మంది వరకు రావణుడిని ఆరాధకులు ఉన్నారని రామదాస్ చెప్పడం గమనార్హం.

    ఇక దశాబ్దాలుగా రామాలయ నిర్మాణం కోసం వేచి చూస్తున్న అయోధ్య వాసుల కలకు నేటితో బీజం పడనుంది. 300కోట్లతో మూడున్నర ఏళ్లలో రామాలయం నిర్మాణం పూర్తికానుంది. రామాలయ భూమి పూజ నేపథ్యంలో ఇప్పటికే అయోధ్యనగరం సర్వాంగ సుందరంగా ముస్తాబై.. రామనామ స్మరణతో మార్మోగిపోతుంది.