నాగబాబు స్వంత కుంపటి ఏమైంది ?

మెగా బ్రదర్ నాగబాబు మొదట నటుడిగా ప్రయత్నించి సక్సెస్ కాలేక..ఆ తరువాత మెగాస్టార్ సాయంతో నిర్మాతగా మారి పూర్తిగా నష్టపోయి.. చిట్టచివరకు జబర్దస్త్ అనే బూతు కామెడీ షో తో ఎక్కువగా పాపులర్ అయి.. మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. ఆ తరువాత మల్లెమాల సంస్థతో తనకు వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా జబర్దస్త్ నుండి బయటకు వచ్చాడు. జీ టీవీ లో అదిరింది అంటూ షో అంటూ మొదలెట్టారు. పైగా ఆ అదిరింది ‘షో’ను సక్సెస్ […]

Written By: admin, Updated On : September 20, 2020 2:24 pm
Follow us on


మెగా బ్రదర్ నాగబాబు మొదట నటుడిగా ప్రయత్నించి సక్సెస్ కాలేక..ఆ తరువాత మెగాస్టార్ సాయంతో నిర్మాతగా మారి పూర్తిగా నష్టపోయి.. చిట్టచివరకు జబర్దస్త్ అనే బూతు కామెడీ షో తో ఎక్కువగా పాపులర్ అయి.. మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. ఆ తరువాత మల్లెమాల సంస్థతో తనకు వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా జబర్దస్త్ నుండి బయటకు వచ్చాడు. జీ టీవీ లో అదిరింది అంటూ షో అంటూ మొదలెట్టారు. పైగా ఆ అదిరింది ‘షో’ను సక్సెస్ చేయడం తన భుజాల మీద వేసుకుని ముందుకు వెళ్తున్నా.. అది సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’ ఓవర్ బడ్జెట్ పై రాజమౌళి ప్లాన్ !

దీనికితోడు కరోనా కారణంగా మధ్యలో బ్రేక్ రావడంతో అదిరింది షోని జనం కూడా మర్చిపోయినట్టు అయింది. అందుకే నాగబాబు షోను లేపడానికి టాలెంట్ ఉన్న వారి కోసం గాలింపు చర్యలు కూడా ఆ మధ్య బాగానే ప్రారంభించాడు. తన యూ ట్యూబ్ చానెల్ నుంచి జబర్దస్త్, అదిరింది షో ల మాదిరిగా తన చానెల్ లో ఫన్ అండ్ కామెడీ షో ను స్టార్ట్ చేయబోతున్నానని అంటూ నాగబాబు ప్రకటన చేశారు. ఆ ప్రకటనను చూసి వచ్చిన వారిలో బెస్ట్ కామెడీ నటులను, గుడ్ కామెడీ రైటర్లను ఏరి వారిని అదిరింది షోకు పట్టుకుపోతారట.

Also Read: షూటింగుకు రెడీ అవుతున్న సూపర్ స్టార్?

దాంతో ఛాన్స్ లు కోసం వెతుకుతున్న కొత్త కుర్రాళ్ళు నాగబాబు పిలుపు విని విచ్చలవిడిగా తమ టాలెంట్ ను ఓ చిన్న వీడియోలో బంధించి నాగబాబు ఇచ్చిన మెయిల్ ఐడీకి పంపారు. ఎలాగూ నాగబాబు తన యూ ట్యూబ్ చానెల్ ను వీలయినంత పాపులర్ చేసారు కాబట్టి.. ఆ చానెల్ లో కనిపించినా తమకు గుర్తింపు వస్తోందని కొత్త కుర్రాళ్ళ ఆశ. దానికి తగ్గట్లే నాగబాబు చానెల్ కు దాదాపు మూడు లక్షల మందికి పైగా సబ్ స్క్రయిబర్లు వున్నారు. అయితే ఫ్రెషర్స్ ను ఓ ఎంట్రీ మోడ్ గా తన చానెల్ ను తయారు చేయాలని అనుకున్న నాగబాబు ఆ తరువాత ఏమైందో ఏమో సైలెంట్ అయిపోయారు. నాగబాబు స్వంత కుంపటి ఏమైంది అని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.