Anasuya Bharadwaj : బుల్లితెర ద్వారా యాంకర్ గా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరై , ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి , ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ , నేటి తరం ఆడియన్స్ కి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్న వారిలో ఒకరు అనసూయ. సోషల్ మీడియా ద్వారా కూడా ఈమె నెటిజెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అయితే అప్పుడప్పుడు ఈమె మాట్లాడే కొన్ని మాటలు తీవ్రమైన వివాదాలకు దారి తీస్తూ ఉంటుంది. ఆ కారణం చేత ట్రోల్స్ కి గురి అవుతూ ఉంటుంది. ట్రోల్స్ ని స్పోర్టివ్ గా తీసుకోవడం అనసూయ కి అలవాటే కానీ , అవి హద్దులు దాటి , తన పరువుకు భంగం కలిగించినప్పుడు మాత్రం , ఆమె తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యి , పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ప్రతీ రోజు వర్కౌట్ వీడియోస్ , ఫొటోస్ లను అప్లోడ్ చేస్తూ ఉంటుంది అనసూయ. అలా ఈరోజు కూడా ఒక వీడియో ని అప్లోడ్ చేస్తూ ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘ప్రతీ రోజు ఉదయం నిద్ర లేవడం , వర్కౌట్స్ చెయ్యడం అనేది అంత తేలికైన విషయం కాదు. నిద్ర మత్తులో ఉన్న మనం , ఈరోజు ఏమి చేస్తాము లే , రేపు చూద్దాం అని బద్దకిస్తుంటాము. కానీ కష్టమైన వర్కౌట్స్ చేయడం అలవాటు చేసుకోండి. ఒక్కసారి అలవాటు చేసుకుంటే అసలు ఆపలేరు. అందమైన శరీరం కోసం ప్రతీ రోజు ఒక గంట సమయాన్ని కేటాయించండి. కుదిరితే గంటన్నర సమయం కేటాయించండి’ అని కనుసైగలు చేస్తూ , చాలా రొమాంటిక్ గా ఈ వీడియో ని అప్లోడ్ చేసింది అనసూయ.
ఈ వీడియో ని మీకోసం క్రింద షేర్ చేస్తున్నాం చూడండి. ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే , ప్రస్తుతం ఆమె తమిళం లో ‘ఫ్లాష్ బ్యాక్’, ‘వోల్ఫ్’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. తెలుగు లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా , విలన్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి , ఆడియన్స్ నుండి మంచి మార్కులు కొట్టేసిన అనసూయ, ఇప్పుడు తమిళ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యింది. మరి టాలీవుడ్ లో వచ్చిన గుర్తింపు , కోలీవుడ్ లో కూడా వస్తుందా లేదా అనేది చూడాలి.
