Homeఎంటర్టైన్మెంట్నాగబాబు స్వంత కుంపటి ఏమైంది ?

నాగబాబు స్వంత కుంపటి ఏమైంది ?


మెగా బ్రదర్ నాగబాబు మొదట నటుడిగా ప్రయత్నించి సక్సెస్ కాలేక..ఆ తరువాత మెగాస్టార్ సాయంతో నిర్మాతగా మారి పూర్తిగా నష్టపోయి.. చిట్టచివరకు జబర్దస్త్ అనే బూతు కామెడీ షో తో ఎక్కువగా పాపులర్ అయి.. మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. ఆ తరువాత మల్లెమాల సంస్థతో తనకు వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా జబర్దస్త్ నుండి బయటకు వచ్చాడు. జీ టీవీ లో అదిరింది అంటూ షో అంటూ మొదలెట్టారు. పైగా ఆ అదిరింది ‘షో’ను సక్సెస్ చేయడం తన భుజాల మీద వేసుకుని ముందుకు వెళ్తున్నా.. అది సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’ ఓవర్ బడ్జెట్ పై రాజమౌళి ప్లాన్ !

దీనికితోడు కరోనా కారణంగా మధ్యలో బ్రేక్ రావడంతో అదిరింది షోని జనం కూడా మర్చిపోయినట్టు అయింది. అందుకే నాగబాబు షోను లేపడానికి టాలెంట్ ఉన్న వారి కోసం గాలింపు చర్యలు కూడా ఆ మధ్య బాగానే ప్రారంభించాడు. తన యూ ట్యూబ్ చానెల్ నుంచి జబర్దస్త్, అదిరింది షో ల మాదిరిగా తన చానెల్ లో ఫన్ అండ్ కామెడీ షో ను స్టార్ట్ చేయబోతున్నానని అంటూ నాగబాబు ప్రకటన చేశారు. ఆ ప్రకటనను చూసి వచ్చిన వారిలో బెస్ట్ కామెడీ నటులను, గుడ్ కామెడీ రైటర్లను ఏరి వారిని అదిరింది షోకు పట్టుకుపోతారట.

Also Read: షూటింగుకు రెడీ అవుతున్న సూపర్ స్టార్?

దాంతో ఛాన్స్ లు కోసం వెతుకుతున్న కొత్త కుర్రాళ్ళు నాగబాబు పిలుపు విని విచ్చలవిడిగా తమ టాలెంట్ ను ఓ చిన్న వీడియోలో బంధించి నాగబాబు ఇచ్చిన మెయిల్ ఐడీకి పంపారు. ఎలాగూ నాగబాబు తన యూ ట్యూబ్ చానెల్ ను వీలయినంత పాపులర్ చేసారు కాబట్టి.. ఆ చానెల్ లో కనిపించినా తమకు గుర్తింపు వస్తోందని కొత్త కుర్రాళ్ళ ఆశ. దానికి తగ్గట్లే నాగబాబు చానెల్ కు దాదాపు మూడు లక్షల మందికి పైగా సబ్ స్క్రయిబర్లు వున్నారు. అయితే ఫ్రెషర్స్ ను ఓ ఎంట్రీ మోడ్ గా తన చానెల్ ను తయారు చేయాలని అనుకున్న నాగబాబు ఆ తరువాత ఏమైందో ఏమో సైలెంట్ అయిపోయారు. నాగబాబు స్వంత కుంపటి ఏమైంది అని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version