War2 Vs Rajasaab: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) నటించిన ‘రాజా సాబ్'(The Rajasaab) మూవీ చిత్రం టీజర్ కాసేపటి క్రితమే విడుదలై సోషల్ మీడియా లో ఎలాంటి ప్రకంపనలు పుట్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టార్ హీరోల సినిమాలు లేక థియేటర్స్ బోసిపోయాయి. వాళ్లకు సంబంధించిన అప్డేట్స్ లేక సోషల్ మీడియా లో సందడే లేకుండా పోయింది. రాజా సాబ్ టీజర్ ఈ రెండు లోపాలను పూడ్చింది. కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో ఈ టీజర్ ని అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది. ప్రభాస్ అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్స్ కి తరళి రావడంతో, ఒక్కసారిగా ట్రేడ్ ఊపిరి పీల్చుకుంది. ఇంత జనాలను థియేటర్స్ లో చూసి ఎన్ని రోజులైందో అంటూ అనడంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. థియేటర్స్ బయట ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన హంగామాకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇక యూట్యూబ్ లో టీజర్ రికార్డుల మీద రికార్డులను నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతుంది. టీజర్ విడుదలై కేవలం నాలుగు గంటలు మాత్రమే అయ్యింది. ఈ నాలుగు గంటల్లో ఈ టీజర్ కి 50 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) లేటెస్ట్ చిత్రం ‘వార్ 2′(War 2 Teaser) తెలుగు టీజర్ కి మొదటి 24 గంటల్లో 30 లక్షల వ్యూస్ కూడా రాలేదు. ‘వార్ 2 ‘ టీజర్ కి ఇప్పటి వరకు 2 లక్షల 77 వేల లైక్స్ వస్తే, ‘రాజా సాబ్’ టీజర్ కి కేవలం నాలుగు నాలుగు గంటల్లోనే 4 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ విషయాన్నీ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేసుకుంటూ ఎన్టీఆర్ పై ట్రోల్స్ వేస్తున్నారు. అయితే ‘రాజా సాబ్’ టీజర్ కి మొదటి రోజు నుండే యాడ్స్ వేశారు, అందుకే అన్ని వ్యూస్ వస్తున్నాయి.
Also Read: War 2 Movie : ‘వార్ 2’ టీజర్ నుండి ఎన్టీఆర్ డైలాగ్ లీక్..ఈ రేంజ్ లో ఉందేంటి బాబోయ్!
కానీ ‘వార్ 2’ కి మొదటి రోజు ఎలాంటి యాడ్స్ వేయలేదు కానీ, రెండవ రోజు నుండి మాత్రం యాడ్స్ వేశారు. కానీ లైక్స్ విషయం లో మాత్రం రెండు సినిమాల మధ్య నిజమైన వ్యత్యాసం కనిపిస్తుంది. ‘వార్ 2 ‘ ‘రాజా సాబ్’ కి కనీసం దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఎన్టీఆర్ అభిమానులు ఈ టీజర్ ని ఎందుకో పెద్దగా పట్టించుకోలేదని అనిపిస్తుంది. చూడాలి మరి ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక ఫలితాల మధ్య కూడా ఇంతటి వ్యత్యాసం ఉంటుందా?, లేకపోతే ‘వార్ 2’ లీడ్ తీసుకొని సర్ప్రైజ్ చేస్తుందా అనేది. ఇకపోతే ‘వార్ 2’ చిత్రం ఆగష్టు 14 న విడుదల కాబోతుండగా, ‘రాజా సాబ్’ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.