War 2 Movie : ఎన్టీఆర్(Junior NTR) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘వార్ 2′(War 2 Movie) మూవీ టీజర్ ఎల్లుండి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతుంది. చాలా కాలం నుండి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మేకర్స్ దాచి పెడుతూ వచ్చారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యి నెల రోజులైంది. ఈ నెల రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు మేకర్స్. అందుకే టీజర్ కట్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేకపోయారు. కానీ ఇప్పుడు అన్నీ సిద్ధంగా ఉండడం తో స్వయంగా హృతిక్ రోషన్(Hrithik Roshan) అధికారికంగా తన ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ విషయాన్ని తెలియజేసాడు. ‘నీ పుట్టినరోజుకి నేను ఇచ్చే బహుమతిని నువ్వు కలలో కూడా ఊహించలేవు’ అంటూ హృతిక్ రోషన్ ఒక డైలాగ్ చెప్తాడు.
Also Read : ఎన్టీఆర్, అమీర్ ఖాన్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..?
దానికి ఎన్టీఆర్ కౌంటర్ ఇస్తూ ‘రిటర్న్ గిఫ్ట్ కోసం సిద్ధంగా ఉండు బ్రదర్’ అని డైలాగ్ కొడుతాడు. టీజర్ లో కూడా ఇదే తరహా డైలాగ్ ఉంటుందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇందులో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అది పూర్తి స్థాయి నెగటివ్ క్యారక్టరా?, లేకపోతే మధ్యలో ఏదైనా ట్విస్ట్ ఉందా అనేది చూడాలి. ఎందుకంటే ఎన్టీఆర్ క్యారక్టర్ పై ఈ స్పై యూనివర్స్ నుండి ఒక ప్రత్యేకమైన సినిమా కూడా వస్తుందట. అంటే ఆయన స్పై యూనివర్స్ మొత్తానికి విలన్ గా నటించబోతున్నాడా?, లేకపోతే క్యారక్టర్ లో వివిధ కోణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ కి మాత్రం చాలా కాలం తర్వాత ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ పడినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఎల్లుండి విడుదల అవ్వబోయే టీజర్ తోనే అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది.
ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా కియారా అద్వానీ(Kiara Advani) నటించింది. పెళ్ళికి ముందే ఈమె ఈ సినిమాని ఒప్పుకున్నది. ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా, ప్రశాంత్ నీల్ మూవీ కి సంబంధించిన అప్డేట్ వస్తుందని అభిమానులు చాలా ఆశపడ్డారు. కానీ వార్ 2 చిత్రం ఆగస్టు 14 న విడుదల అవుతున్న ఈ నేపథ్యం లో అభిమానుల ఫోకస్ #NTRNeel వైపు వెళ్లకూడదని, ఆ చిత్ర యూనిట్ ‘వార్ 2’ కోసం కొన్ని రోజులు మా అప్డేట్స్ ని ఆపేస్తున్నాము అంటూ ఒక ప్రకటన చేసింది. దీనిపై అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కానీ కొంతమంది మాత్రం ఈ సినిమా అప్డేట్ కూడా వచ్చి ఉండుంటే బాగుండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే మూడవ షెడ్యూల్ ని మొదలు పెట్టుకోనుంది.