War 2 Pre-Release Event: ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2 ‘(War 2 Movie) చిత్రం మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే చాలా కాలం తర్వాత ఇద్దరు సూపర్ స్టార్స్ నటించిన పాన్ ఇండియన్ చిత్రం కాబట్టి ఈ సినిమా పై అంచనాలు వేరే లెవెల్ లో ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో అంచనాలు క్రియేట్ అవ్వలేదు. ఫలితంగా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ నిల్. ప్రొమోషన్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ యాష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు ప్రొమోషన్స్ చేయడానికి ఇష్టపడరట. అందుకే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి కనీసం ఒక్క ఇంటర్వ్యూ కూడా బయటకు రాలేదు. సినిమాకు హైప్ రావాలంటే కచ్చితంగా ప్రొమోషన్స్ ఉండాలి, అప్పుడే భారీ ఓపెనింగ్స్ వస్తాయి. ఇప్పుడు అభిమానుల ఆశలన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పైనే ఉంది.
Also Read: మహేష్ బర్త్ డే వేళ రాజమౌళి అప్టేట్.. ఇండస్ట్రీ షేక్ అయ్యిందిగా.. !
కనీసం ఇదైనా జరుగుతుందా లేదా అనే అనుమానం లో ఉండగా, ఎన్టీఆర్ స్పెషల్ రిక్వెస్ట్ కారణంగా యాష్ రాజ్ ఫిలిమ్స్ వారి అనుమతి తో రేపు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పెరేడ్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కూడా హాజరు కాబోతున్నాడు. వీళ్లిద్దరు ఇచ్చే ప్రసంగం మీద, తద్వారా క్రియేట్ అయ్యే బజ్ ఆధారంగానే ఈ సినిమా ఓపెనింగ్స్ ఉంటుంది. ఎన్టీఆర్ ప్రసంగం కచ్చితంగా అద్భుతంగా ఉంటుంది కాబట్టి, ఈ చిత్రం పై ఎట్టి పరిస్థితి లో బజ్ క్రియేట్ అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఓపెనింగ్స్ విషయం లో తెలుగు వెర్షన్ నుండి కనీస స్థాయిలో అయినా వస్తే ఈ సినిమాకు ఉపయోగపడుతుంది. అది ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా మాత్రమే కాకుండా, ఎన్టీఆర్ క్యారక్టర్ ని ఎలా డిజైన్ చేశారు అనేదానిపై కూడా ఆధారపడుంది.
Also Read: 100 ఏళ్ళ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ‘మహావతార్ నరసింహా’ అరుదైన రికార్డు!
ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ చిత్రం లో ఎన్టీఆర్ నెగటివ్ రోల్ లోనే కనిపించబోతున్నాడు. హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు అభిమానుల రోమాలు నిక్కపొడుచుకొని రేంజ్ లో ఉంటాయట. అంతే కాదు ఈ సినిమాలో వచ్చే ట్విస్టులు, సర్ప్రైజ్ లు చూస్తే ఫ్యాన్స్ కి మతి పోవడం ఖాయమని అంటున్నారు. మరి అందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి. రీసెంట్ గానే వీళ్లిద్దరి కలిసి డ్యాన్స్ వేసిన ‘సలాం అనాలి’ అనే పాటకు సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు మేకర్స్. పూర్తి పాట విడుదల అవుతుందని అనుకున్నారు కానీ, పూర్తి పాట కేవలం థియేటర్స్ లోనే చూడాలట. ఇలా ఈ చిత్రం భారీ ఓపెనింగ్ ని సాధించడానికి అవసరమయ్యే అన్ని దారులు మూసుకుపోయాయి. కేవలం పాజిటివ్ టాక్ మాత్రమే ఈ చిత్రాన్ని కాపాడగలదు.