Mahavatar Narasimha Record: ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ స్టార్ పవర్ మీద కాకుండా కేవలం కంటెంట్ మీద మాత్రమే నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గా కేవలం నటీనటులతోనే కాదు, యానిమేషన్ సినిమాలతో కూడా వండర్స్ క్రియేట్ అని నిరూపించిన చిత్రం ‘మహావతార్ నరసింహా'(Mahavatar Narasimha). ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ యానిమేషన్ చిత్రం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రభంజనం సృష్టించింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని కేవలం 15 కోట్ల రూపాయిల బడ్జెట్ తోనే తెరకెక్కించారట. అంతే కాదు, ఇండియా లో మొట్టమొదటి యానిమేషన్ చిత్రం కూడా ఇదే. హాలీవుడ్ లో యానిమేషన్ సినిమాలు ప్రభంజనం సృష్టించడం కొత్తేమి కాదు, కానీ ఇండియా ఇలాంటివి జరగడం ఇదే తొలిసారి.
Also Read: ఇంకా వారం ఉంది.. ఏంటి ఈ క్రేజ్? మాములుగా లేదుగా?
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అందులో తెలుగు వెర్షన్ వసూళ్లే ఎక్కువ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఒక సినిమా పై మన తెలుగు ఆడియన్స్ ప్రేమ చూపిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి ఒక ఉదాహరణ గా నిల్చింది ఈ సినిమా. ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్స్ లో విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా కి ఒక్క రోజు ముందుగా పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం వచ్చింది. కానీ ఆ సినిమా కూడా ఈ చిత్రం ముందు నిలబడలేకపోయింది. ‘మహావతార్ నరసింహా’ విడుదలైన ఆరు రోజులకు విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ చిత్రం విడుదలైంది. ఇది కూడా కమర్షియల్ గా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మళ్ళీ మహావతార్ నరసింహా దే పై చెయ్యి.
Also Read: తిరుగులేని అల్లు అర్జున్… అదీ సార్ పుష్ప గాడి బ్రాండ్!
వచ్చే వారం ఎన్టీఆర్,హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’, రజనీకాంత్ ‘కూలీ’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. రెండు పెద్ద సినిమాలే కాబట్టి, కచ్చితంగా ‘మహావతార్ నరసింహా’ ని అత్యధిక థియేటర్స్ నుండి తొలగించవచ్చు. కానీ వచ్చే వారం విడుదలయ్యే రెండు సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం మళ్ళీ ‘మహావతార్ నరసింహా’ బాక్స్ ఆఫీస్ వద్ద తన విశ్వరూపం చూపించే అవకాశం ఉంటుంది. ఈ వీకెండ్ లో కూడా ఈ సినిమా దే హవా. దేవుడి సినిమా కావడం, పైగా వరలక్ష్మి వ్రతం కూడా ఉండడం తో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి ఎగబడుతున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ జైత్ర యాత్ర ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.