HBD Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటివరకు ఎవ్వరికి లేనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు…కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన వరుస సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు… ఈరోజు ఆయన బర్త్ డే సందర్భంగా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న.తన అభిమానులందరు ఇది ఒక ఫెస్టివల్ లా జరుపుకుంటున్నారు. నిజానికి మహేష్ బాబు సినిమాలో కనిపించే హీరో కంటే కూడా బయట తన హ్యుమానిటీని చాటుకుంటూ మానవత్వం ఉన్న ఒక మనిషిగా చాలా గొప్ప కార్యక్రమాలు చేపడుతూ ఉంటాడు. ఇప్పటికే 5వేలకు పైన చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన వ్యక్తి గా చాలా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగానే సేవా కార్యక్రమాల విషయంలో కూడా ఆయన చాలా స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఆయన చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మేమంటే డబ్బున్న వాళ్ళం కాబట్టి ఎలాగోలాగా బతికేస్తాం, కానీ పేద వాళ్ళ పరిస్థితి ఏంటి? అనే ఉద్దేశ్యంతో చిన్న పిల్లలకు గుండా ఆపరేషన్లు చేయించడానికి పూనుకున్నామంటూ ఆయన చెప్పిన మాటలు చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులైతే ఆయన గురించి చెప్పుకుంటూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు…
Also Read: 100 ఏళ్ళ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ‘మహావతార్ నరసింహా’ అరుదైన రికార్డు!
ఇక ఇది చూస్తూ కొంతమంది సినిమా మేధావులు సైతం హీరోలు అంటే సినిమాల్లో ఫైట్లు చేస్తూ హీరోయిన్ లతో పాటలు పాడుతూ నాలుగు భారీ డైలాగులు చెప్పి సినిమాని సక్సెస్ఫుల్ చేసి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడం మాత్రమే కాదు. తమను హీరోగా ఆదరిస్తున్న జనాల యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు కాపాడే వాళ్ళనే నిజమైన హీరోలు అంటారని మహేష్ బాబు ప్రూవ్ చేస్తున్నాడు.
ఇక ఇలాంటి సందర్భంలోనే ఈరోజు ఆయన పుట్టినరోజు కావడం వల్ల ఎంతమంది చిన్నపిల్లలనైతే ఆయన కాపాడాడో వాళ్ళందరు అతనికి విషెస్ ని చెబుతూ చాలా సంతోషపడుతున్నారు. 5000 మంది పిల్లల సంతోషానికి గురయ్యాడనే చెప్పాలి…
Also Read: మహేష్ బర్త్ డే వేళ రాజమౌళి అప్టేట్.. ఇండస్ట్రీ షేక్ అయ్యిందిగా.. !
అలాంటి మహేష్ బాబు చేస్తున్న అడ్వటైజ్ మెంట్ కి వచ్చే డబ్బులను చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు కేటాయిస్తూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. అందుకే ఆయన ఎక్కువ ఆడ్ ఫిలిమ్స్ చేస్తూ అలా వచ్చిన డబ్బులను పిల్లల ఆపరేషన్స్ కి మళ్లిస్తూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…