SSMB29: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే వేళ అభిమానులకు గిఫ్ట్ అందింది. దాన్ని అందించింది మరెవరో కాదు, మాస్టర్ స్టోరీటెల్లర్ రాజమౌళి. మహేష్‌తో తెరకెక్కిస్తున్న తన నెక్స్ట్ మాగ్నమ్ ఓపస్‌పై రాజమౌళి ఒక అద్భుతమైన ఫొటోను విడుదల చేస్తూ, కీలక అప్‌డేట్‌ను ప్రకటించారు.
Also Read: ‘మయసభ’ కాదు ఇదీ.. రాజకీయ ప్రతీకార సభ?
రాజమౌళి నవంబర్ 2025లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మొదటి అప్‌డేట్ రాబోతుందని ట్వీట్ చేశారు. ఇది కేవలం తెలుగు సినిమా కాకుండా ప్యాన్ వరల్డ్ మూవీ అవుతుందని స్పష్టంగా చెబుతూ, ప్రపంచాన్ని చుట్టే ఒక సాహసికుడి కాన్సెప్ట్‌ను సూచించేలా #GlobeTrotter హ్యాష్‌ట్యాగ్ జోడించారు.
విడుదల చేసిన పోస్టర్‌లో మహేష్ బాబు గుండెలపై శక్తివంతమైన ఎద్దు ప్రతీక, పైన శివుడి డమరుకం, త్రిశూలం, మూడునామాలు, రుద్రాక్ష కలిపి ఒక మిస్టికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫీల్ కలిగించేలా ఉంది. మహేష్ బాడీ లుక్ పవర్‌ఫుల్‌గా, రగ్గ్డ్‌గా, అదే సమయంలో ఆధ్యాత్మికతతో నిండుగా కనిపిస్తోంది.
ఈ అప్‌డేట్‌తో అభిమానులు, ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఉత్సాహంతో మునిగిపోయింది. రాజమౌళి-మహేష్ కాంబోలో వస్తున్న ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా కోసం ఇప్పుడు కౌంట్‌డౌన్ మొదలైంది. నవంబర్‌లో ఫస్ట్ గ్లింప్స్ వస్తుందన్న మాటే ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
The First Reveal in November 2025… #GlobeTrotter pic.twitter.com/MEtGBNeqfi
— rajamouli ss (@ssrajamouli) August 9, 2025