https://oktelugu.com/

ట్రైలర్ టాక్: 1600మందిని ప్రేమించే ‘పాగల్’

ప్రేమ కోసమే పుట్టాడు ‘ప్రేమ్’. శ్రీకృష్ణుడిలా తనకు వేలమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే 1600 మందిని ప్రేమించాడు. సిటీలో ఏ అమ్మాయి కనిపించినా సరే వెళ్లి ఐలవ్ యూ చెబుతుంటాడు ‘పాగల్’ హీరో విశ్వక్ సేన్. తను ప్రేమించడానికి అందం, చందం, పర్సనాలిటీ అవసరం లేదు.. కేవలం అమ్మాయి అయితే చాలు.. ఇలాంటి డిఫెరెంట్ ‘పాగల్’ మూవీ కథతో మనముందుకు వస్తున్నాడు హీరో విశ్వక్ సేన్.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 10, 2021 / 12:44 PM IST
    Follow us on

    ప్రేమ కోసమే పుట్టాడు ‘ప్రేమ్’. శ్రీకృష్ణుడిలా తనకు వేలమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే 1600 మందిని ప్రేమించాడు. సిటీలో ఏ అమ్మాయి కనిపించినా సరే వెళ్లి ఐలవ్ యూ చెబుతుంటాడు ‘పాగల్’ హీరో విశ్వక్ సేన్. తను ప్రేమించడానికి అందం, చందం, పర్సనాలిటీ అవసరం లేదు.. కేవలం అమ్మాయి అయితే చాలు.. ఇలాంటి డిఫెరెంట్ ‘పాగల్’ మూవీ కథతో మనముందుకు వస్తున్నాడు హీరో విశ్వక్ సేన్.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఆకట్టుకునేలా సరికొత్తగా ఉంది.

    ట్రైలర్ చూస్తే.. ప్రేమ కోసం పిచ్చివాడిలా తిరిగే జులాయి యువకుడిగా హీరో విశ్వక్ సేన్ కనిపించాడు. కనిపించిన ప్రతీ అమ్మాయి చేతిలో పువ్వు పెట్టి ప్రేమించు అని వేడుకుంటాడు. అలా 1600 మంది అమ్మాయిలకు ఐ లవ్ యూ చెబుతాడు.

    ఈ క్రమంలోనే ఓ అసలైన ఆడపిల్ల అతడి మనసుకు బాగా నచ్చుతుంది. ఆమె హీరోయిన్ ‘నివేదా పేతురాజ్’. ఇన్నాళ్లు మనస్ఫూర్తిగా ప్రేమించని విశ్వక్ హీరోయిన్ ను చూడగానే నిజంగా ప్రేమలో పడుతాడు. ఆ అమ్మాయి కోసం ఏం చేశాడు? ఆమె రిజెక్ట్ చేస్తే ఎలా దక్కించుకున్నాడన్నది కథ..

    ఈ ట్రైలర్ చూస్తే సినిమా ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా కనిపిస్తోంది. విశ్వక్ సేన్ ఫుల్ లవర్ బాయ్ లా సందడి చేశాడు. తన ఫ్రెండ్స్ సర్కిల్స్, ప్రేమలు, వీటితోని ఫుల్ కామెడీ పండించినట్టు తెలుస్తోంది. కుర్రాళ్లు, యూత్ మెచ్చే చిత్రంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఈనెల 13న థియేటర్లలో విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది.

    విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ హీరోహీరోయిన్లుగా బెక్కం వేణుగోపాల్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీకి నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించారు. దిల్ రాజు ఈ మూవీని సమర్పిస్తుండడంతో అంచనాలు పెరిగిపోయాయి.