మానవత్వం మంటగలిసి పోతుంది కని పెంచి ప్రయోజకుల్ని చేసిన పిల్లలు రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోని పరిస్థితి ఎర్పడింది..ఇక అవసరం లేదని రోడ్లపై వదిలేసి వెళుతున్న దుస్థితి నెలకొంది కృష్ణా జిల్లా జగ్గయ్యపేట షేర్ మహమ్మద్ పేట లో అర్ధరాత్రి వర్షంలో తడుస్తున్న వృద్దురాలిని విధులు నిర్వహిస్తున్న పోలీసులు చూశారు ఆ వృద్ధురాలు దగ్గరికి వెళ్లి వివరాలు అడగ్గా ఆమె చెప్పిన సమాచారంతో ఖంగుతిన్న పోలీసులు వెంటనే ఆహారాన్ని ఇచ్చి ఆవిడ తిన్న తర్వాత ఆమెను జగ్గయ్యపేటలోని అనాధ ఆశ్రమం కి తరలించారు.
నిన్న రాత్రి సూర్యారావు పేట నుండి వృద్దురాలిని ఆటోలో తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను జగ్గయ్యపేటలోని ఊరిబయట షేర్ మహ్మద్ పేటలో వదిలి వెళ్ళారు. వదిలి వెళ్ళింది కుటుంబసభ్యులే అని తెలిసి వృద్దురాలు వేదన చెందుతూ ఎటు వెళ్లాలో తెలియక అక్కడే ఉండి పోయింది. రాత్రి సమయంలో చిల్లకల్లు పోలీస్స్టేషన్ పరిధిలోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలో ఊరిబయట డంపింగ్ యార్డ్ వద్ద ఉన్న వృద్ధురాలును చూసి ఎస్సై దుర్గా ప్రసాద్ వాహనాన్ని ఆపి ఆమెను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఆమె సూర్యాపేటకు చెందిన వ్యక్తి అని కుటుంబ సభ్యులు వదిలి వెళ్లారని చెప్పడంతో చలించిపోయిన ఎస్సై వెంటనే అమెకు తన దగ్గర ఉన్న ఆహరాన్ని అందించి ఆమెను తన వాహనం లో తీసుకువెళ్లి జగ్గయ్యపేటలోని అనాధాశ్రమంలో చెర్పించారు. కుటుంబ సభ్యుల వివరాలు తీసుకొని ఎస్సై దుర్గాప్రసాద్ విచారణ చేపట్టారు .