చిన్న హీరోకి పెద్ద అవకాశం

వెళ్లి పోమాకే అనే చిన్న చిత్రం తో విశ్వక్సేన్ హీరోగా తెరంగేట్రం చేసాడు. 2017 లో విడుదలైన ఈ చిత్రం తరవాత 2018 లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ నగరానికి ఏమైంది చిత్రం చేయడం జరిగింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై రూపొందిన ఈ చిత్రం ఆర్ధికంగా పరవాలేదు అన్న రీతిలో ఆడింది. ఈ చిత్రం తరవాత 2019 లో ఫలక్ నుమా దాస్ అనే మరో చిన్న చేస్తే అది కూడా ఒడ్డున పడింది. […]

Written By: Neelambaram, Updated On : March 12, 2020 4:36 pm
Follow us on

వెళ్లి పోమాకే అనే చిన్న చిత్రం తో విశ్వక్సేన్ హీరోగా తెరంగేట్రం చేసాడు. 2017 లో విడుదలైన ఈ చిత్రం తరవాత 2018 లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ నగరానికి ఏమైంది చిత్రం చేయడం జరిగింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై రూపొందిన ఈ చిత్రం ఆర్ధికంగా పరవాలేదు అన్న రీతిలో ఆడింది. ఈ చిత్రం తరవాత 2019 లో ఫలక్ నుమా దాస్ అనే మరో చిన్న చేస్తే అది కూడా ఒడ్డున పడింది. ఇక తాజాగా 2020 ఫిబ్రవరి 28 న విడుదలైన “హిట్” సినిమా పెద్ద సక్సెస్ సాధించి విశ్వక్సేన్ ని నటుడిగా మరో మెట్టు ఎక్కించింది.

అలా వరుస విజయాలతో సక్సెస్ ను సొంతం చేసుకున్న విశ్వక్ సేన్ హీరోగా, బెక్కెం వేణుగోపాల్ నిర్మాణంలో ఓ సినిమా రాబోతుంది. . కాగా క్రేజీ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాకి “పాగల్” అనే టైటిల్ ను ఫిక్స్ చేసిందట ఆ చిత్ర బృందం. త్వరలోనే చిత్రబృందం కూడా ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటించనుంది.

కాగా ఈ మూవీతో నరేష్ రెడ్డి కుప్పిలి అనే యంగ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. క్రేజీ లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ రెండో వారం నుండి మొదలుకానుంది. ఇక “ హిట్” లాంటి సూపర్ హిట్ మూవీ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన విశ్వక్ సేన్ కి లక్కీ మీడియా బ్యానర్ ఆఫర్ ఇవ్వడం తో ఈ సినిమా పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి
Slow and steady wins the race