Cult Movie Review: విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతి ని ఇచ్చేందుకు తపన పడే హీరోల్లో ఒకరు విశ్వక్ సేన్. యూత్ ఆడియన్స్ ఈయన సినిమా విడుదల అయితే కచ్చితంగా థియేటర్స్ కి కదులుతారు. టాక్ బాగాలేకపోయిన కనీస స్థాయి ఓపెనింగ్స్ ఇస్తుంటారు. కానీ ‘కల్ట్’ చిత్రం మాత్రం యూత్ ఆడియన్స్ లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో కనీసం ట్రెండింగ్ లోకి కూడా రాలేకపోయింది ఈ చిత్రం. ఈ సినిమాకు విశ్వక్ సేన్ దర్శకత్వం కూడా వచించాడు. గతంలో ఆయన దర్శకత్వం లో తెరకెక్కిన ‘ఫలక్ నూమాదాస్’ , ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాలకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈరోజు విడుదలైన కల్ట్ చిత్రం కూడా అదే రేంజ్ లో అలరించిందో లేదో ఈ రివ్యూ లో చూద్దాం.
కథ విషయానికి వస్తే ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సరదాగా పార్టీ చేసుకోవడానికి ఒక క్లబ్ కి వెళ్లిన యువతీ యువకులకు అక్కడ ఎదురైనా కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు విశ్వక్ సేన్. గోవాలోని ఒక మారుమూల ప్రాంతం లో నిర్వహించే పార్టీ కి పెద్ద సంఖ్యలో యువతీ యువకులు హాజరు అవుతారు. మొదట సాధారణ పార్టీ లాగానే అనిపిస్తుంది , కానీ ఆ తర్వాతే వాళ్లకు అర్థం అవుతుంది , ఇక్కడ చిక్కుకుపోయామని. మాస్కులు ధరించిన వాళ్ళు అక్కడున్న వారిని లక్ష్యంగా చేసుకొని , ఒక ప్రమాదకరమైన ఆట ని నిర్వహిస్తారు. ఈ ఆటలో ఓడిపోయిన వారిని చంపేస్తూ ఉంటారు. వీళ్ళని రక్షించడానికి హీరో విశ్వక్ సేన్ ఎలా పోరాడాడు అనేదే స్టోరీ.
ఈ సినిమాతో విశ్వక్ సేన్ మన తెలుగు ఆడియన్స్ కి ఒక సరికొత్త సర్వైవల్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేసాడు. కానీ ఎక్కువగా నెట్ ఫ్లిక్స్ లో ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలే తెరకెక్కాయి. అవి చూసిన ఆడియన్స్ కి ఈ చిత్రం పెద్దగా కిక్ ఇవ్వకపోవచ్చు , కానీ కొత్తగా చూసేవారికి మాత్రం ఈ సినిమా మంచి థియేట్రికల్ అనుభూతిని ఇస్తుందనే చెప్పాలి. ట్రైలర్ ని చూసినప్పుడే మన అందరికీ ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ గుర్తుకు వస్తుంది. సినిమా కూడా అలాగే ఉంటుందని అనుకున్నాం , నిజంగా అలాగే ఉంది, కానీ మన తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా కొన్ని కమర్షియల్ హంగులు అద్దాడు విశ్వక్ సేన్. ఓవరాల్ గా ఈ చిత్రం యావరేజ్ రేంజ్ అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి మా ఓకే తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.25/5.. హాలీవుడ్ వెబ్ సిరీస్ లు చూసేవారికి ఈ సినిమా పెద్దగా అనిపించకపోవచ్చు , కానీ కొత్తగా చూసేవారికి మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది. ఈ చిత్రం పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.