Vishvambhara : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) రీ ఎంట్రీ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర'(Vishwambhara Movie). ‘బింబిసార’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ వశిష్ట(Vasistha Malladi) తెరకెక్కిస్తున్న సినిమా ఇది. భారీ హిట్ తర్వాత మెగాస్టార్ లాంటి హీరో తో గ్రాఫిక్స్ నేపథ్యం లో సాగే సినిమా తీస్తుండడంతో మొదట్లో ఈ చిత్రం పై అంచనాలు మామూలు రేంజ్ లో ఉండేవి కాదు. కానీ ఎప్పుడైతే టీజర్ విడుదలైందో, అప్పటి నుండి అంచనాలు మొత్తం ఆవిరయ్యాయి. ఎందుకంటే గ్రాఫిక్స్ అత్యంత నాసిరకంగా ఉండడం వల్లే. అభిమానుల దగ్గర నుండి దురాభిమానుల వరకు ప్రతీ ఒక్కరు ఈ టీజర్ లోని గ్రాఫిక్స్ ని చూసి ఒక రేంజ్ ట్రోల్ చేసారు. దీంతో VFX టీం మొత్తాన్ని మార్చి 75 కోట్ల రూపాయిలు ఖర్చు చేసి రీ వర్క్ చేసారు. ఇప్పుడు ఔట్పుట్ చాలా బాగా వచ్చిందని అంటున్నారు కానీ, అది ఎంత వరకు నిజమో చూడాలి.
Also Read : ‘విశ్వంభర’ మొదటి పాట విడుదల తేదీని ప్రకటించిన మూవీ టీం!
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ చిత్రం నుండి హనుమాన్ జయంతి రోజున ‘రామ రామ’ అనే లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసారు. దీనికి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ పాటను ఎలా అయినా జనాల్లోకి తీసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఒక సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఈ పాటను కొన్ని వేల పెన్ డ్రైవ్స్ లో అప్లోడ్ చేసి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే హనుమాన్, రామాలయాలకు కానుకగా ఇవ్వబోతున్నారు. అందుకు సంబంధించిన వీడియో ని మీరు క్రింద చూడవచ్చు. దీనిని చూసిన నెటిజెన్స్ చాలా మంచి ఆలోచన అని, పుణ్యంతో పాటు, సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ కూడా వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి మేకర్స్ వేసిన ఈ ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
ఇకపోతే సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ మినహా, మొత్తం పూర్తి అయ్యిందని, కేవలం గ్రాఫిక్స్ కి సంబంధించిన వర్క్ మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. జులై లేదా ఆగష్టు నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రం లో హీరోయిన్ గా త్రిష కృష్ణన్ నటిస్తుంది. స్టాలిన్ చిత్రం తర్వాత ఆమె మెగాస్టార్ చిరంజీవి తో కలిసి చేస్తున్న రెండవ సినిమా ఇది. అదే విధంగా ఈ చిత్రంలో మలయాళం స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, మరికొంత మంది యంగ్ హీరోయిన్స్ కీలక పాత్రలు చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుండి రెండవ టీజర్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
Also Read : ‘విశ్వంభర’ చిత్రం నుండి మొదటి పాట ‘రామ రామ’ ప్రోమో వచ్చేసింది..!
విశ్వంభర సినిమా నుంచి 'రామ రామ' అనే పాట విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ పాటని పెన్‌డ్రైవ్స్ లో నిక్షిప్తం చేసి, తెలుగు రాష్ట్రాల్లోని శ్రీరామ, హనుమాన్ ఆలయాల్లో పూజారులకు కానుకగా ఇవ్వనున్నారు.
ఓరకంగా మంచి ప్రయత్నం..
మరో రకంగా కావల్సినంత పబ్లిసిటీ!#vishwambhara… pic.twitter.com/PqTpUhUTZu
— Telugu360 (@Telugu360) April 29, 2025