Thudaram : ఈమధ్య కాలం లో ఎంత సూపర్ హిట్ సినిమాకి అయిన వీకెండ్ లో ఉండే జోరు, మామూలు వర్కింగ్ డేస్ లో కనపడడం లేదు. ఒకప్పుడు కనిపించేవి కానీ, ఓటీటీ యుగం మొదలయ్యాక బాగా తగ్గిపోయింది. అరుదుగా కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే మనం ఇలాంటివి చూస్తూ ఉంటాము. రీసెంట్ గా విడుదలైన మోహన్ లాల్(Mohanlal) ‘తుడరం'(Thudaram) చిత్రం అలాంటి అరుదైన ఫీట్ ని రిపీట్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘L2: ఎంపురాన్’ లాంటి భారీ హిట్ తర్వాత, కేవలం నెల రోజుల వ్యవధి లోనే ‘తుడరం’ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా చాలా సాధారణంగా విడుదలైంది. అంత సింపుల్ గా విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడం, ఆ టాక్ కి తగ్గట్టుగా వసూళ్లు ఉండడం అందరినీ షాక్ కి గురి చేసింది.
Also Read : బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు రేపిన మోహన్ లాల్ ‘తుడారం’..3 రోజుల్లో ఎంత వచ్చిందంటే!
ఇక ఆ తర్వాత మొదటి రోజుకంటే రెండవ రోజు, మూడవ రోజు చివరికి వర్కింగ్ డే అయినటువంటి నాల్గవ రోజున కూడా ఎక్కువ వసూళ్లు వచ్చాయి. వర్కింగ్ డే రోజు వచ్చిన వసూళ్లు, మొదటి రోజుకంటే ఎక్కువ ఉండడం కేవలం సంక్రాంతి సీజన్ లోనే చూస్తుంటాం. అలాంటిది ఇప్పుడు మామూలు వర్కింగ్ డేస్ లో చూస్తున్నామంటే ఇది సాధారణమైన విషయం కాదు. మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే, నాల్గవ రోజున ఈ చిత్రానికి 19 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈరోజు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 15 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయంటే, ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. నేడు కూడా ఈ చిత్రానికి 18 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఓవరాల్ గా ఈ చిత్రానికి మూడు రోజుల్లో 84 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 41 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇక కేవలం నాలుగు కోట్ల రూపాయిలను మాత్రమే రాబట్టాలి. నేటితో ఆ బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా అందుకుంది ఈ సినిమా. రేపటి నుండి వచ్చేవి మొత్తం లాభాలే. కేవలం కేరళ నుండి ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో 27 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఓవర్సీస్ లో అయితే ఏకంగా 48 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. కచ్చితంగా ఈ చిత్రం కూడా ఓవర్సీస్ మార్కెట్ లో వంద కోట్ల గ్రాస్ ని రాబడుతుందని అనుకోవడం లో ఎలాంటి సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి కోటి 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
Also Read : ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీనే నెంబర్ 1 : మోహన్ లాల్