YouTube video : అపరిమితమైన డాటా. . లెక్కకు మిక్కిలి యాప్స్ ఉన్నప్పటికీ..యూ ట్యూబే ఇప్పటికీ హవా కొనసాగిస్తున్నది. వీడియోలు.. ఆటలు.. పాటలు.. మాటలు.. అంతకుమించి ఆదాయం.. ఇవన్నీ యూట్యూబ్ ద్వారా సమకూరడంతో.. యూట్యూబ్ అనేది ప్రస్తుతం అద్భుతమైన ఇన్కమ్ సోర్స్ గా మారిపోయింది. అంతేకాదు అతిపెద్ద యాప్ గా అవతరించింది. వయసుతో తేడా అనేది లేకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో యూట్యూబ్ చూస్తూనే ఉంటారు. నచ్చిన వీడియోలను చూసి సందడి చేస్తూనే ఉంటారు. యూట్యూబ్లో రకరకాల వీడియోలను వీక్షిస్తూనే ఉంటారు. అయితే ఈ యూట్యూబ్లో వ్యూస్ ఆధారంగా డబ్బులు వస్తుంటాయి. అయితే ఇప్పటివరకు అత్యధిక వ్యూస్ కలిగిన యూట్యూబ్ వీడియో ఏదంటే.. దానికి సమాధానమే ఈ కథనం.
Also Read : యూట్యూబ్‌కు 20 ఏళ్లు.. సోషల్ ప్రపంచంలో డిజిటల్ విప్లవం!
1500 కోట్ల వ్యూస్..
సాధారణంగా యూట్యూబ్లో ఒక మిలియన్ వ్యూస్ వస్తేనే ఓ రేంజ్ లో ఫీల్ అవుతుంటారు. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1500 కోట్ల వ్యూస్ ఒక వీడియోకు లభించాయి. ఈ వీడియోను దాదాపు 8 సంవత్సరాల క్రితం యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఆ వీడియో పేరు బేబీ షార్క్ డ్యాన్స్.. ఈ వీడియోలో భారీ హంగామా ఉండదు. గొప్ప గొప్ప ఆర్భాటాలు ఉండవు . జస్ట్ ఓ పిల్లాడు.. యానిమేటెడ్ కార్టూన్స్ కనిపిస్తుంటాయి. అతడు బేబీ షార్క్ డ్యాన్స్ అంటూ పాట పాడుతుంటాడు. ఈ వీడియో చాలా మందికి నచ్చడంతో ఏకంగా అది 1500 కోట్ల వ్యూస్ వరకు వెళ్లిపోయింది. దీని తర్వాత స్థానంలో వీల్స్ ఆన్ ది బస్ వీడియో ఉంది. ఇది 8.70 బిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక బాత్ సాంగ్ 7.08 బిలియన్ వీక్షణలు సొంతం చేసుకుంది… జానీ జానీ ఎస్ పాపా 7.4 బిలియన్ వ్యూస్ తో సరికొత్త రికార్డు సృష్టించింది.. యూట్యూబ్లో మిస్టర్ బీస్ట్ ఛానల్ కు తిరుగులేదు. ఈ ఛానల్ కు అత్యధికంగా 38.8 కోట్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు. మిస్టర్ బీస్ట్ ఛానల్ లో ఎక్కువగా వీడియో పాటలు ఉంటాయి. అవి యువతరానికి విపరీతంగా నచ్చుతుంటాయి. అందువల్లే ఆ చానల్ ను అంతమంది అనుకరిస్తున్నారు. ఆ చానల్లో అప్లోడ్ అయ్యే వీడియోలు కోట్లల్లో వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. అయితే యూట్యూబ్లో అత్యధిక ఆదరణ సాధిస్తున్న వీడియోలలో ఎక్కువ శాతం చిన్నపిల్లలవి ఉండడం విశేషం. ఇక బేబీ షార్క్ వీడియో సైతం చిన్నపిల్లలది కావడం విశేషం. ఇందులో ఏమంత గొప్పతనం లేకపోయినా.. భారీగా హంగు ఆర్బాటలు లేకపోయినప్పటికీ.. చిన్నపిల్లలు ఈ వీడియోను విపరీతంగా చూస్తున్నారు. అందువల్లే ఈ వీడియో ఈ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. అంతకంతకు వ్యూస్ ను పెంచుకుంటూ పోతుంది. తద్వారా యూట్యూబ్ చరిత్రలోనే సరికొత్త రికార్డులను.. అనితర సాధ్యమైన ఘనతలను సృష్టిస్తోంది.
Also Read : వీడు మామూలోడు కాదు.. తల్లీకూతుళ్ళను ఒకేసారి గర్భవతులను చేశాడు.. వైరల్ వీడియో