Emmaheesters Srivalli Song: తెలుగులో తయారై ప్యాన్ ఇండియా లెవల్లో ఊపు ఊపిన ‘పుష్ప’ మూవీలోని ‘శ్రీవల్లి’ పాట ఇప్పుడు ఖండాతరాలు దాటుతోంది. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను, సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఆ పాట స్ఫూర్తితో ఫిదా అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప పాప్ సింగర్స్ కూడా తమదైన శైలిలో పాడి ఈ పాటకు మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు. దీంతో ‘పుష్ప’ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పటికే టీమిండియా సహా వివిధ దేశాల క్రికెటర్స్ తో సహా అందరూ పుష్పలోని ఏదో సీన్ ను, పాటను, డైలాగ్ ను రీల్స్ చేస్తూ కనిపిస్తున్నారు. ఆఖరికి అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ లో కూడా పుష్ప క్రేజ్ తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. తాజాగా పుష్ప లోని శ్రీవల్లి పాటకు ఇంగ్లీష్ వెర్షన్ ను పాడింది ఓ డచ్ సింగర్. ప్రస్తుతం ఈ ఇంగ్లీష్ వెర్షన్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఎమ్మా ఎక్కువగా పాటలు పాడుతూ పాప్ సింగర్ గా పాపులర్ అయ్యింది. ఇంగ్లీష్ సాంగ్స్ ను ఆలపిస్తూ ఫేమస్ అయ్యింది. కానీ తొలిసారి తానొక తెలుగు పాటను పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన సోషల్ మీడియా ఖాతాలో పాటను షేర్ చేసి ఫిదా చేసింది.
పుష్ప మూవీలోని ‘శ్రీవల్లి’ పాటకు ఎమ్మా పాడిన పాటలు వైరల్ అయ్యింది. తెలుగు పదాలను ఇంగ్లీష్ గొంతుతో పాడితే ఎలా వింతగా ఉంటుందో ఎమ్మా పాడిన పాట వింటే కూడా అలానే అనిపిస్తోంది. మీరూ ఈ పాటను చూసి ఎంజాయ్ చేయండి.

[…] Punjab CM Candidate: దేశంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పార్టీల్లో అలజడి రేగుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో పంజాబ్ లో సీఎం అభ్యర్థిని ప్రకటించి కాంగ్రెస్ ప్రచారం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. లూథియానాలో జరిగిన వర్చువల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిని వర్చువల్ గా ప్రకటించింది. దీంతో సీఎం అభ్యర్థి చరణ్ జిత్ సింగ్ చన్నీని తమ సీఎం అభ్యర్థిగా అధినేత రాహుల్ గాంధీ ప్రకటించడంతో వేదిక మీదే కూర్చున్న చన్నీ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోతి సింగ్ సిద్దూ కాళ్లు తాకడం వివాదాస్పదమైంది. […]