Virata Parvam Collections: విరాటపర్వం 3 రోజుల వసూళ్లు..రానా కి మరో బిగ్ షాక్

Virata Parvam Collections: దగ్గుపాటి రానా – సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా వేణు ఉడుగుల దర్శకత్వం లో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యం లో తెరకెక్కిన ‘విరాటపర్వం’ సినిమా ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..తెలంగాణ ప్రాంతం లోని వరంగల్ అడవుల్లో చోటు చేసుకున్న నక్సలైట్ ఎన్కౌంటర్ ఆధారం గా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది..ఓపెనింగ్స్ కూడా […]

Written By: Neelambaram, Updated On : June 19, 2022 1:07 pm
Follow us on

Virata Parvam Collections: దగ్గుపాటి రానా – సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా వేణు ఉడుగుల దర్శకత్వం లో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యం లో తెరకెక్కిన ‘విరాటపర్వం’ సినిమా ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..తెలంగాణ ప్రాంతం లోని వరంగల్ అడవుల్లో చోటు చేసుకున్న నక్సలైట్ ఎన్కౌంటర్ ఆధారం గా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది..ఓపెనింగ్స్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చాయి..సుమారు రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మొదటి రోజే దక్కించుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 11 కోట్ల రూపాయలకు జరిగింది..గత ఏడాది ఏప్రిల్ 17 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ఎన్నో OTT ఆఫర్లను వదులుకొని ఎట్టకేలకు థియేటర్స్ లో విడుదలైంది..ఇది ఇలా ఉండగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం చాలా కష్టం అని..మొదటి మూడు రోజుల్లో ఎంత రాబడితే అంతే క్లోసింగ్ కలెక్షన్స్ అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

Virata Parvam Movie

మొదటి మూడు రోజులు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూలు చేసిందో విశ్లేషిస్తే, మొదటి రోజు 2 కోట్ల రూపాయిలు వసూలు చేసిన ఈ సినిమా రెండవ రోజు 1 కోటి 75 లక్షలు..మూడవ రోజు 1 కోటి 60 లక్షలు వసూలు చేసిందని..మూడు రోజులకు కలిపి 5 కోట్ల 35 లక్షల షేర్ ని వసూలు చేసిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..ఫుల్ రన్ లో కేవలం మరో 60 లక్షల రూపాయిలు మాత్రమే వసూలు చేసే అవకాశం ఉందని..దాదాపుగా 4 కోట్ల రూపాయలకు పైగానే నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది..కమర్షియల్ సినిమా కాకపోవడం..దానికి తోడు మొదటి నుండి అసలు ఎలాంటి అంచనాలు లేకపోవడం వల్లే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆడలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్ట్రిక్ట్ వార్నింగ్… దర్శక నిర్మాతలకు డెడ్ లైన్?

Virata Parvam Moie

భీమ్లా నాయక్ లాంటి మాస్ హిట్ తర్వాత రానా చెయ్యాల్సిన సినిమా ఇది కాదని..కమర్షియల్ మాస్ సినిమాలు చేస్తే రానా బాక్స్ ఆఫీస్ మైలేజ్ బాగా పెరుగుతుందని..లేకపోతే భవిష్యత్తులో ఆయన సినిమాలకు జనాలు థియేటర్స్ కి రావడం మానేస్తారని..అప్పుడు మళ్ళీ సైడ్ క్యారక్టర్ రోల్స్ ఏసుకోవాల్సిందేనని దగ్గుపాటి ఫాన్స్ రానా ని హెచ్చరిస్తున్నారు..రానా కూడా వాళ్ళ మాటలని సీరియస్ గా తీసుకొని ఇక నుండి ప్రయోగాలు చెయ్యనని..మాస్ సినిమాలు మాత్రమే చేస్తానని అభిమానులకు మాట ఇచ్చాడు..మరి ఇచ్చిన మాట ప్రకారం రానా తన రూట్ ని మార్చుకుంటాడో లేదో చూడాలి.

Also Read:Chiranjeevi- VV Vinayak: డైరెక్టర్ వివి వినాయక్ ని ఆదుకున్న చిరంజీవి!… ఈ వార్త నిజమేనా?

Tags