https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్ట్రిక్ట్ వార్నింగ్…?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలపై కంటే జనసేన పార్టీ బలోపేతం పైనే దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఆయన ఎక్కువగా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఆయన రైతు భరోసా యాత్ర ప్రారంభించారు. ఇక అక్టోబర్ నుండి బస్సు యాత్ర చేయనున్నారు. దానికి కావలసిన ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. పవన్ కాన్వాయ్ కోసం ఎనిమిది కొత్త కార్లను కొనుగోలు చేశారు. బస్సు యాత్ర నెలల తరబడి సాగనుంది. బస్సు యాత్ర ముగిసిన […]

Written By:
  • Shiva
  • , Updated On : June 19, 2022 / 12:52 PM IST
    Follow us on

    Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలపై కంటే జనసేన పార్టీ బలోపేతం పైనే దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఆయన ఎక్కువగా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఆయన రైతు భరోసా యాత్ర ప్రారంభించారు. ఇక అక్టోబర్ నుండి బస్సు యాత్ర చేయనున్నారు. దానికి కావలసిన ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. పవన్ కాన్వాయ్ కోసం ఎనిమిది కొత్త కార్లను కొనుగోలు చేశారు. బస్సు యాత్ర నెలల తరబడి సాగనుంది. బస్సు యాత్ర ముగిసిన తర్వాత కూడా ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉండనున్నారు. దీంతో పవన్ ప్రకటించిన కొన్ని చిత్రాలు డిలే కానున్నాయి.

    Pawan Kalyan

    అయితే పవన్ తక్షణం హరిహర వీరమల్లు పూర్తి చేయాలని భావిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ తో హరి హర వీరమల్లు తెరక్కుతుంది. క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు హరి హర వీరమల్లు షూటింగ్ 50 శాతం పూర్తయినట్లు సమాచారం. మిగతా షూటింగ్ ఆగస్టు ముగిసే నాటికి పూర్తి చేయాలని దర్శక నిర్మాతలకు పవన్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చారట. చెప్పిన టైం కి కనీసం తన పార్ట్ పూర్తి చేయాలని సూచించారట. దీంతో దర్శకుడు క్రిష్ ఆ దిశగా ఏర్పాట్లు మొదలుపెట్టారట. ఆగస్టుకి హరి హర వీరమల్లు, సెప్టెంబర్ లో వినోదయ సిత్తం రీమేక్ పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారట.

    Also Read: Janhvi Kapoor: అతుకుల డ్రెస్ లో అన్నీ చూపిస్తూ.. శ్రీదేవి కూతురు ఇలా తయారయ్యిందేంటి!

    వినోదయ సిత్తం కోసం పవన్ కేవలం 15 నుండి 20 రోజులు కేటాయించారట, సెప్టెంబర్ నెలలో వినోదయ సిత్తం లోని పవన్ పార్ట్ పూర్తి చేయనున్నారట. ఇక 2024 ఎన్నికల వరకు పవన్ నుండి వచ్చేది ఈ రెండు చిత్రాలే అన్నమాట వినిపిస్తుంది. కాగా భవదీయుడు భగత్ సింగ్ డిలే అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండగా… సినిమాలు చేస్తూ కూర్చుంటే సరికాదని ఆయన నమ్ముతున్నారు.

    Pawan Kalyan

    ఇక హరి హర వీరమల్లు చిత్రంతో పవన్ బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం. ఆయన నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు కాగా భారీ అంచనాలున్నాయి. మొఘలుల కాలం నాటి యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో పవన్ బందిపోటుగా కనిపించడం విశేషం. నిధి అగర్వాల్, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

    Also Read:Chiranjeevi- VV Vinayak: డైరెక్టర్ వివి వినాయక్ ని ఆదుకున్న చిరంజీవి!… ఈ వార్త నిజమేనా?

    Tags