Pawan Kalyan- Akira Nandan: ఇటీవల కాలం లో సోషల్ మీడియా లో బాగా ట్రెండింగ్లో ఉన్న స్టార్ కిడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్..జిమ్ లో కర్ర సాము చెయ్యడం..తెలుగు లో బ్లాక్ బస్టర్ హిట్టైన సాంగ్స్ ని పియానో ద్వారా వాయించడం..ఇలా పలు రకాలుగా తన నైపుణ్యం ని చాటుకొని అకిరా నందన్ సోషల్ మీడియా లో బాగా ఫేమస్ అయిపోయాడు..చూడడానికి యాక్షన్ హీరో లాగా అదిరిపొయ్యే కటౌట్ తో అందరిని షాక్ కి గురి చేస్తున్న అకీరానందన్ టాలీవుడ్ లో హీరోగా ఎప్పుడు అడుగుపెడుతాడో అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..అకిరా వాయిస్ లో కూడా అద్భుతమైన బేస్ ఉండడం తో, మంచి స్టోరీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే కచ్చితంగా రామ్ చరణ్ రేంజ్ లో క్లిక్ అవుతాడని అభిమానులు ఆశిస్తున్నారు..ఇక అకిరా నందన్ కి తన తల్లి తండ్రులంటే ఎంత అభిమానమో మన అందరికి తెలిసిందే..రేణు దేశాయ్ తాను జడ్జి గా వ్యవహరిస్తున్న షోస్ లో అకీరానందన్ గురించి చెప్తూ ఉంటుంది.
స్వతహాగా సంగీతం లో మంచి నైపుణ్యం ఉన్న అకీరానందన్ ఈరోజు ఫాథర్స్ డే సందర్భంగా తన తండ్రి పవన్ కళ్యాణ్ కోసం ఒక్క అద్భుతమైన పాట రాసి, మంచి మ్యూజిక్ తో దానిని రికార్డింగ్ చేసి పవన్ కళ్యాణ్ కి బహుమతిగా పంపాడట..తన కొడుకు తన కోసం ఇంత అద్భుతమైన పాటని డెడికేట్ చేసినందుకు పవన్ కళ్యాణ్ ఎంతో మురిసిపొయ్యాడట..అంతే కాకుండా ఫాథర్స్ డే పురస్కరించుకొని తన తండ్రి పేరిట గుడిలో అర్చన చేయించి,100 మందికి అన్నదానం చేసాడట.
Also Read: Virata Parvam Collections: విరాటపర్వం 3 రోజుల వసూళ్లు..రానా కి మరో బిగ్ షాక్
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఇంత చిన్న వయసులో పదిమందికి అన్నం పెట్టాలనే ఆలోచన రావడం నిజంగా గ్రేట్ అని..పవన్ కళ్యాణ్ కొడుకు కదా ఆయనలోని అద్భుతమైన లక్షణాలు కొడుకుకి రాకుండా ఎలా ఉంటుంది అంటూ అభిమానులు మురిసిపోతున్నారు..అకిరా కి ఇలాంటి దానాలు చెయ్యడం ఇదేమి కొత్త కాదు..కరోనా మహమ్మారి విలయతాండవం ఆడుతున్న సమయం లో కూడా అకీరానందన్ ఆకలి తో ఉన్న వారికి అన్నం పెట్టడం..ప్రభుత్వ హాస్పిటల్స్ కి ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం లాంటివి అప్పట్లో చాలానే చేసాడట..ఈ విషయాన్నీ స్వయంగా రేణు దేశాయ్ తెలిపింది.
Also Read:Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్ట్రిక్ట్ వార్నింగ్… దర్శక నిర్మాతలకు డెడ్ లైన్?