Vinoth Kishan: తన సినిమాను ప్రమోట్ చేయడానికి సహాయం చేయాలని కోరుతున్నాడు యువ హీరో. సినిమా బాగా వచ్చింది. ఖచ్చితంగా హిట్ అవుతుంది. విడుదలయ్యాక వచ్చిన వసూళ్లతో మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను అంటున్నాడు. వివరాల్లోకి వెళితే… చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టాడు వినోద్ కిషన్. నంద, ప్రస్థానం, సేన చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. అనంతరం పలు చిత్రాల్లో విలన్, సపోర్టింగ్ రోల్స్ చేశాడు. తాజాగా వినోద్ కిషన్ హీరో అవతారం ఎత్తాడు.
పేకమేడలు టైటిల్ తో ఓ చిత్రం చేశాడు. ఈ మూవీ ప్రమోషన్స్ కి డబ్బులు కావాలని వినోద్ కిషన్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశాడు. తెలుగులో తొలిసారి హీరోగా నటించాను. పేక మేడలు చిత్రంలో నాది లక్ష్మణ్ అనే ఇంట్రెస్టింగ్ రోల్. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా రిజల్ట్ పట్ల చాలా నమ్మకం ఉంది. అయితే మూవీని ప్రమోట్ చేయడానికి డబ్బులు కావాలి. మీరు రూ. 5, లేదా రూ. 10 రూపాయలైనా సహాయం చేయండి.
Also Read: Kalki Movie Ticket: కల్కి సినిమా ఒక్కో టికెట్ 2300.. ఇంత డిమాండ్ ఎక్కడంటే..?
క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయగలరు. సినిమా విడుదలయ్యాక మీ డబ్బు వడ్డీతో సహా ఇచ్చేస్తాను. దయచేసి హెల్ప్ చేయండి… అని రిక్వెస్ట్ చేశాడు. గతంలో ఎవరూ ఇలా రిక్వెస్ట్ చేయలేదు. వినోద్ కిషన్ వీడియో వైరల్ అవుతుంది. మనోడి రిక్వెస్ట్ కి స్పందించిన కొందరు సహాయం చేస్తున్నారు.
Also Read: Horror Comedy Movie OTT: నేరుగా ఓటీటీలో ఆ హారర్ కామెడీ చిత్రం…ఎక్కడ చూడొచ్చు?
వినోద్ కిషన్ ఇటీవల విడుదలైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో విలన్ రోల్ చేశాడు. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పర్లేదు అనిపించుకుంది. హీరోగా పేక మేడలు చిత్రంతో తన అదృష్టం పరీక్షించుకోవాలి అనుకుంటున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమా విడుదల అయోమయంలో పడింది. సినిమా తీయడం కంటే దాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా విడుదల చేయడమే పెద్ద విషయం. అందుకే చాలా చిత్రాలు విడుదలకు నోచుకోకుండా ఏళ్ల తరబడి ఉండిపోతాయి.