https://oktelugu.com/

Kalki Movie Ticket: కల్కి సినిమా ఒక్కో టికెట్ 2300.. ఇంత డిమాండ్ ఎక్కడంటే..?

Kalki Movie Ticket: కల్కి సినిమా టికెట్లను బుక్ మై షో లో వదిలిన గంట సేపట్లోనే 70 వేల టికెట్లు అమ్ముడుపోయాయి అంటే మామూలు విషయం కాదు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా టికెట్లను ముంబైలో భారీ రేటుకు అమ్మేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : June 26, 2024 / 12:25 PM IST

    Prabhas Kalki movie Ticket price is 2300

    Follow us on

    Kalki Movie Ticket: ప్రస్తుతం ఇండియా వైడ్ గా కల్కి సినిమా హవా నడుస్తుందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం అభిమానులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఇక రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా విషయంలో ప్రతి ఒక్క అభిమాని కూడా మొదటి షో లోనే సినిమాని చూసేయాలి అనేంతలా ఉత్సాహాన్ని చూపిస్తూ సినిమా టికెట్ రేట్లు పెంచిన కూడా వాటిని పట్టించుకోకుండా టికెట్లను కొనుగోలు చేస్తూ సినిమాని చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

    కల్కి సినిమా టికెట్లను బుక్ మై షో లో వదిలిన గంట సేపట్లోనే 70 వేల టికెట్లు అమ్ముడుపోయాయి అంటే మామూలు విషయం కాదు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా టికెట్లను ముంబైలో భారీ రేటుకు అమ్మేస్తున్నారు. మైనస్ ఐనాక్స్ లోని జియో వరల్డ్ ప్లాజా లో ఒక్కో టికెట్ 2300 లకు అమ్ముతున్నారు. ఇక మరికొన్ని థియేటర్లలో అభిమానులు 1760, 1560 రూపాయలకు అమ్మిన కూడా టికెట్లను కొనుగోలు చేస్తూ సినిమా చూడడమే తమ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక కల్కి సినిమా బుకింగ్స్ లోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తుంది.

    Also Read: Kalki Movie: కల్కి కోసం రక్తం కారేలా కొట్టుకోబోతున్న భైరవ(ప్రభాస్),అశ్వద్ధామ(అమితా బచ్చన్)… ఎందుకంటే..?

    ఒక మొదటి షో పడితే గాని సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో తెలియదు సినిమా టాక్ ను బట్టి ఈ సినిమా మరింత ఎక్కువ కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ టాక్ ను సంపాదించుకొని 1500 కోట్లకు పైన కలెక్షన్లను కూడా రాబడుతుందనే అంచనాలో సినిమా యూనిట్ అయితే ఉంది.

    Also Read: Kalki 2: కల్కిలో 2 స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయట… అవి ఏంటంటే..?

    ఇక అభిమానులు కూడా అదే తరహాలో ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది… మరి మొత్తానికైతే ప్రభాస్ మరోసారి పాన్ ఇండియాలో తన నట విశ్వరూపాన్ని చూపిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం కలిపి 790 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది…