spot_img
Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi Village Backdrop Movie: పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో మెగాస్టార్ చిరంజీవి కొత్త...

Megastar Chiranjeevi Village Backdrop Movie: పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరంటే!

Megastar Chiranjeevi Village Backdrop Movie: ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం తో రీజనల్ ఇండస్ట్రీ హిట్ ని అందుకొని మంచి ఊపు మీదున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య ‘ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాంటి సినిమా తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు మామూలు రేంజ్ లేవు. అయితే ఎప్పుడో జనవరి నెలాఖరున షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకోవాల్సిన ఆ సినిమా , నిర్మాతకు ఏర్పడ్డ కొన్ని అనివార్య ఇబ్బందుల కారణంగా షూటింగ్ మొదలు అవ్వని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ గ్యాప్ లోనే మెగాస్టార్ చిరంజీవి మరో క్రేజీ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టేశాడు.

Also Read: నార్త్ లో అల్లు అర్జున్ మేనియా నడుస్తుందా..? ఆ బాలీవుడ్ స్టార్ నేను నీ సినిమాలో చేస్తాను బన్నీ అని అడిగాడా..?

డైరెక్టర్ సుకుమార్ వద్ద చాలా కాలం నుండి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తికి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చాడని టాక్. రీసెంట్ గానే చిరంజీవి ని కలిసి స్టోరీ లైన్ ని వినిపించగా, ఆయనకు అది తెగ నచ్చడం , వెంటనే ఓకే చెప్పడం వంటివి జరిగాయట. ఈ సినిమా పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుంది సమాచారం . డైరెక్టర్ బాబీ మూవీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంటే, మెగాస్టార్ ముందుగా ఈ చిత్రాన్నే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డైరెక్టర్ సుకుమార్ వద్ద పని చేసిన అస్సితన్త డైరెక్టర్స్ నేడు డైరెక్టర్స్ గా మారి ఇండస్ట్రీ ని ఒక రేంజ్ లో ఏలుతున్నారు. ఆయన స్కూల్ నుండి ఒక కొత్త డైరెక్టర్ వస్తున్నాడంటే చాలు, ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతుంటాయి.

ఇప్పటి వరకు ఆయన స్కూల్ నుండి వచ్చిన బుచ్చి బాబు , శ్రీకాంత్ ఓదెల వంటి వారు ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు శ్రీనివాస్ కూడా కచ్చితంగా ఆ స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే అతనిలో విషయం లేకపోతే, మెగాస్టార్ చిరంజీవి స్థాయి వ్యక్తి అవకాశం ఇవ్వడు కదా. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ తో సినిమా చేసిన తర్వాత, వరుసగా సుకుమార్ స్కూల్ కి చెందిన డైరెక్టర్స్ తో పని చేయబోతుండడం. శ్రీకాంత్ ఓదెల తో ఇప్పటికే ఒక సినిమా ఖరారు అయ్యింది. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే శ్రీనివాస్ తో మరో సినిమాని మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు మెగాస్టార్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper
Exit mobile version