https://oktelugu.com/

Horror Comedy Movie OTT: నేరుగా ఓటీటీలో ఆ హారర్ కామెడీ చిత్రం…ఎక్కడ చూడొచ్చు?

Horror Comedy Movie OTT: బాలీవుడ్ హీరోగా రితేష్ దేశ్ ముఖ్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు చేశారు. ఇటీవల హిట్ టాక్ సొంతం చేసుకున్న హీరామండి సిరీస్ తో సౌత్ ఆడియన్స్ కి కూడా సోనాక్షి సిన్హా పరిచయమైంది.

Written By:
  • S Reddy
  • , Updated On : June 26, 2024 / 12:10 PM IST

    Kakauda OTT Release Date

    Follow us on

    Horror Comedy Movie OTT: హారర్ కామెడీ చిత్రాలు ఇష్టపడేవారి కోసం ఓ మూవీ సిద్ధం అవుతుంది. కాకుడి టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఆ వివరాలు ఏమిటో చూద్దాం. ఓటీటీ ప్రాచుర్యం పొందాక విభిన్నమైన కంటెంట్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా లెక్కలేనన్ని హారర్ చిత్రాలు, సిరీస్లు వివిధ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. భయపెట్టే హారర్ ఎలిమెంట్స్ తో పాటు, కడుపుబ్బా కామెడీ పంచేందుకు వచ్చేసింది కాకుడి చిత్రం.

    బాలీవుడ్ హీరోగా రితేష్ దేశ్ ముఖ్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు చేశారు. ఇటీవల హిట్ టాక్ సొంతం చేసుకున్న హీరామండి సిరీస్ తో సౌత్ ఆడియన్స్ కి కూడా సోనాక్షి సిన్హా పరిచయమైంది. ఈసారి ఆమె హారర్ కామెడీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. సాక్విబ్ సలీం ఓ కీలక రోల్ చేశాడు. కాకుడు చిత్రానికి మరాఠి డైరెక్టర్ ఆదిత్య సర్పోట్ ధర్ దర్శకత్వం వహించాడు.

    Also Read: Kalki Movie: కల్కి కోసం రక్తం కారేలా కొట్టుకోబోతున్న భైరవ(ప్రభాస్),అశ్వద్ధామ(అమితా బచ్చన్)… ఎందుకంటే..?

    కాకుడు చిత్రం విడుదల తేదీ ప్రకటించారు. ఈ మూవీ నేరుగా జీ 5లో స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుంది. జులై 12 నుండి స్ట్రీమ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. కాబట్టి త్వరలో ఓ క్రేజీ హారర్ కామెడీ చిత్రాన్ని ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేయనున్నారు.

    Also Read: Celebrities Costumes: సినిమాలు, సీరియల్ లో వాడిన కాస్ట్యూమ్స్ ఏం చేస్తారు

    కాకుడు చిత్రం కథ విషయానికి వస్తే… ఉత్తరప్రదేశ్ లో గల ఓ గ్రామంలో ప్రతి ఇంటికి రెండు గదులు ఉంటాయి. ఒకటి చిన్న గది మరొకటి పెద్దగది. ప్రతి మంగళవారం చిన్నగది తెరుచుకోవాల్సి ఉంటుంది. అలా ఎవరి ఇంటి గది అయితే తెరుచుకోదో ఆ ఇంటి లోని వ్యక్తి కాకుడు చంపేస్తాడు. అసలు ఈ విచిత్రమైన సాంప్రదాయం ఏమిటీ? కాకుడు ఎవరు? మగాళ్లను మాత్రమే ఎందుకు లక్ష్యం చేసుకుంటున్నాడు? అనేది మిగతా కథ.