Hyundai Kona: ఈ కారు కొనడానికి ఇక మార్కెట్లో ఉండదు.. ఎందుకంటే?

దేశంలో కార్ల ఉత్పత్తిలో తనకంటూ ప్రత్యేకత చాటుకుంటోంది హ్యుందాయ్ కంపెనీ. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే చాలా ఆకర్షణీయమైన మోడళ్లు వచ్చాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ కంటే ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోయింది.

Written By: Chai Muchhata, Updated On : June 26, 2024 2:40 pm

Hyundai Kona

Follow us on

Hyundai Kona: కొన్ని అద్భుతమైన కార్లు ఇప్పటికే కనిపించకుండా పోయాయి. అలాంటి కార్లు మరోసారి వస్తాయంటే కారు ప్రియుల్లో పండుగ వాతావరణం నెలకొన్నట్లవుతుంది. గతంలో ఉన్న అంబాసిడర్ కారు.. తిరిగి కొత్త రూపంలో వస్తుందన్న ప్రచార సాగడంతో ఆ కారు ప్రియులు ఎంతో సంతోషించారు. ఆ తరువాత చాలా కార్లు కొన్నాళ్లపాటు అలరించి ఆ తరువాత కనిపించకుండా పోయాయి. అయితే లేటేస్టుగా మరో సూపర్ కారు కూడా కనిపించకుండా పోనుంది. దీనిని కొనుగోలు చేద్దామన్నా మార్కెట్లో కనిపించదు. ఇంతకీ ఏ కారు ఏదంటే?

దేశంలో కార్ల ఉత్పత్తిలో తనకంటూ ప్రత్యేకత చాటుకుంటోంది హ్యుందాయ్ కంపెనీ. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే చాలా ఆకర్షణీయమైన మోడళ్లు వచ్చాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ కంటే ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అందరికంటే ముందుగా హ్యుందాయ్ ‘కోనా’ అనే ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి వచ్చింది. ఇది మార్కెట్లోకి వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ కారు. 2019లో రిలీజ్ అయిన ఈ కారు ఆ తరువాత ఐదేళ్ల పాటు తన హవా సాగించింది.

అయితే ఈ కారు ఇప్పుడు కనుమరుగు కానుంది. అయితే ఈ కారు ఉత్పత్తి నిలిపివేసినా దీని స్థానంలో క్రెటా ఈవీని మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇది 2025 లో మార్కెట్లోకి రానుంది. అయితే ప్రస్తుతం కోనా కారు కొనుగోలు చేయాలని ఉత్సాహం ఉన్నవారు ఆ కారు గురించి తెలుసుకోవాల్సింది. కోనా ఫీచర్స్ విషయానికొస్తే ఈ మోడల్ 29.2 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది. సింగిల్ ఛార్జింగ్ తో 452 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో ఉన్న 100 కిలోవాట్ మోటారు 131 బీహెచ్ పీ పవర్ ను 395 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

కోనా కారు ధర మార్కెట్లో ప్రస్తుతం రూ.25.30 లక్షల తో విక్రయిస్తున్నారు. దీని స్థానంలో క్రెటా ఈవీ రానుంది. ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా కారు ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎస్ యూవీలో ది బెస్ట్ కారుగా ఉన్న క్రెటా ఇప్పుడు ఈవీగా రాబోతుంది. పెట్రోల్, డీజిల్ కార్ల నుంచి ఈవీకి మారాలనుకునేవారు క్రెటా ఈవీ మంచి ఆప్షన్ అని కారు ప్రతినిధులు పేర్కొంటున్నారు. అయితే ఆ కారు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే 2025 వరకు ఆగాల్సిందే..