Open Relationship: భారత్ లో సాంప్రదాయులు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా రిలేషన్ షిప్ మెయింటనెన్స్ లో ఎక్కువ విలువ ఇస్తారు. వివాహం విషయంలో ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవితాంతం వారితో కలిసి ఉంటారు. అయితే కొన్ని దేశాల్లో ఒకే వ్యక్తి ఒకరితో కాకుండా ఓపెన్ రిలేషన్ షిప్ ను కలిగి ఉంటున్నారు. ఇద్దరు పార్ట్స్ నర్స్ ఇతర వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉంటారు. ఇది ఫిజికల్ గా కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కొన్ని దేశాల్లో ఉన్న ఈ సంస్కృతి ఇప్పుడిప్పుడే మిగతా దేశాలకు పాకుతోంది. ఈ విషయంలో ఇండియా మాత్రం ప్రస్తుతం వ్యతిరేకంగా ఉంది. ఒకవేళ మల్టీ రిలేషన్ ఉంటే దానిని తప్పుగా భావిస్తారు. అయితే మల్టీ రిలేషన్ షిప్ ఎలా ఉంటుంది? దీనిని ఎలా కొనసాగిస్తారు?
ఒక వ్యక్తికి మరో వ్యక్తిపై ఎప్పటికీ ఇష్టంతో ఉంటారని అనుకోలేం. కాలం మారుతున్న కొద్దీ ఆ వ్యక్తిపై అయిష్టం ఏర్పడుతుంది. దీంతో ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు వస్తుంటాయి. ఆ తరువాత గొడవలు వచ్చి విడిపోతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో చాలా మంది పెళ్లయిన కొన్నాళ్లకే విడిపోతున్నారు. ఇలా విడిపోవడం కంటే పార్ట్ నర్స్ ఇద్దరి ఇష్టంతో మరో జంటతో రిలేషిన్ షిప్ కొనసాగించాలని అనుకుంటారు. అయితే ఈ సంబంధాలు నలుగురు వ్యక్తుల ఇష్టంతోనే జరగాలి.
ఓపెన్ రిలేషన్ షిప్ మొదలు పెట్టే ముందు భాగస్వామి అనుమతి తీసుకోవాలి. స్త్రీ, పురుష అనుమతితో కొత్త రిలేషన్ ప్రారంభించాలి. ఈ రిలేషన్ ఎలా ఉంటుందంటే ఇద్దరు పార్ట్స్ నర్స్ మరో పార్ట్ నర్స్ తో కలిసి ఉంటారు. వీరు కొన్నాళ్ల పాటు కలిసి ఉండి ఆ తరువాత పాత పార్ట్ నర్స్ తో కలిసిపోతారు. ఈ సంబంధం స్నేహ పూర్వకంగా ఉండొచ్చు.. లేదా ఫీజికల్ గా ఉండొచ్చు. ఈ విషయంపై ఇద్దరి అభిప్రాయం తరువాతే కొనసాగించాలి.
మనసు ప్రశాంతంగా ఉండేందుకు, కపుల్స్ మధ్య ఎలాంటి మనస్పర్థలు రాకుండా ఉండడానికి ఈ సంబంధాలు కొనసాగిస్తారు. అయితే ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రమే కొనసాగుతోంది. ఇలాంటి స్నేహాల వల్ల మనుషుల మధ్య ద్వేషాలు ఉండవని అంటారు. అంతేకాకుండా అనేక ఒత్తిడిల నుంచి దూరమవుతారని కొందరు చెబుతున్నారు.