https://oktelugu.com/

Rishabh Pant: రిషబ్ పంత్ కొట్టిన లాస్ట్ బాల్ సిక్స్ .. షాట్ ఆఫ్ ది టోర్నమెంట్.. వైరల్ వీడియో

బుధవారం న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో అడైర్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ (1) అవుట్ కావడంతో.. రిషబ్ పంత్ వన్ డౌన్ బ్యాటర్ గా మైదానంలోకి అడుగు పెట్టాడు.. న్యూయార్క్ పిచ్ మీద తేమ ఎక్కువగా ఉండడం.. అది ఐర్లాండ్ బౌలర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో.. పంత్ కుదురుకునేందుకు కొంచెం సమయం తీసుకున్నాడు.

Written By:
  • Neelambaram
  • , Updated On : June 6, 2024 10:18 am
    Rishabh Pant

    Rishabh Pant

    Follow us on

    Rishabh Pant: రిషబ్ పంత్..కెరియర్ కీలక దశలో ఉన్నప్పుడే రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చావు చివరి అంచుల దాకా వెళ్లి వచ్చాడు. దాదాపు రెండు సంవత్సరాలపాటు క్రికెట్ కు దూరమయ్యాడు. అతడు లేవడం కష్టం, ఆడడం కష్టం, ఇక అతని ఆట ఒక గత చరిత్ర.. అని అందరూ అనుకున్నారు. వారి అనుమానాలకు తగ్గట్టుగానే అతడి ఆరోగ్యం ఉండేది. కనీసం రెండు నెలల పాటు దంతావధానం కూడా చేసుకోలేదు. అలా ఉండేది మరి అతని పరిస్థితి. ఫినిక్స్ పక్షి లాగా.. తనను తాను బతికించుకున్నాడు. అంతటి నిర్వేదంలోనూ తనను తాను ఆవిష్కరించుకున్నాడు. ఇష్టమైన మైదానంలోకి మళ్ళీ అడుగు పెట్టాడు. ఐపీఎల్ లో ఢిల్లీకి నాయకత్వం వహించాడు. ఔరా అనే స్థాయిలో ఆటను ప్రదర్శించాడు. చివరికి టి20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో స్థానం సంపాదించుకున్నాడు.. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో అర్థ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఐర్లాండ్ జట్టుతో జరిగిన టి20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో భారత జట్టును విజయతీరాలకు తీసుకెళ్లాడు.

    బుధవారం న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో అడైర్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ (1) అవుట్ కావడంతో.. రిషబ్ పంత్ వన్ డౌన్ బ్యాటర్ గా మైదానంలోకి అడుగు పెట్టాడు.. న్యూయార్క్ పిచ్ మీద తేమ ఎక్కువగా ఉండడం.. అది ఐర్లాండ్ బౌలర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో.. పంత్ కుదురుకునేందుకు కొంచెం సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఫోర్లు, సిక్సర్లు ఎడాపెడా బాదాడు. రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్ అయినప్పటికీ.. సూర్య కుమార్ యాదవ్ వెంటనే అవుట్ అయినప్పటికీ.. పంత్ ఏమాత్రం భయపడలేదు. మరో ఎండ్ లో ఉన్న బ్యాటర్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు.. న్యూయార్క్ మైదానంపై ఐర్లాండ్ బౌలర్ల భరతం పట్టాడు.. 26 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో ఏకంగా 36 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

    పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో.. రిషబ్ పంత్ చివర్లో కొట్టిన సిక్సర్ హైలెట్ గా నిలిచింది. భారత ఇన్నింగ్స్ 12 ఓవర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 12 ఓవర్ ను ఐర్లాండ్ బౌలర్ మెక్ కార్తీ వేశాడు. అప్పటికి భారత జట్టు స్కోరు 12.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 91 పరుగులుగా ఉంది. ఈ క్రమంలో మెక్ కార్తీ వేసిన రెండవ బంతిని పంత్ సిక్సర్ కొట్టాడు. దీంతో కార్తీ బిత్తర పోయాడు. ఆప్ స్టంప్ దిశగా వచ్చిన బంతిని సరిగ్గా అంచనా వేసిన పంత్.. బ్యాట్ గమనాన్ని లెఫ్ట్ హ్యాండ్ వైపు మళ్ళించి గట్టిగా కొట్టడంతో స్టాండ్స్ లో పడింది. ఈ షాట్ చూసిన తర్వాత కామెంటేటర్లు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తేరుకుని పంత్ బ్యాటింగ్ చేసిన విధానాన్ని మెచ్చుకున్నారు.. కాగా, పంత్ కొట్టిన ఈ సిక్సర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.