Vijay Devarakonda: వరుస ప్లాప్స్… షాకింగ్ నిర్ణయం తీసుకున్న విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమాలో తన బాడీ లాంగ్వేజ్, అగ్రెసివ్ నెస్ యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసింది.

Written By: S Reddy, Updated On : June 12, 2024 12:36 pm

Vijay Deverakonda took a shocking decision

Follow us on

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఈ పేరుకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. యూత్ లో మాస్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాంటి పేరును మార్చుకునే సాహసం చేయబోతున్నారట రౌడీ హీరో. తల్లిదండ్రుల మాట ప్రకారం విజయ్ దేవరకొండ ఈ నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. విజయ్ డెసిషన్ వెనకున్న కారణం ఏంటో .. ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమాలో తన బాడీ లాంగ్వేజ్, అగ్రెసివ్ నెస్ యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత గీతగోవిందం, టాక్సీ వాలా చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ కొట్టాడు. దీంతో రౌడీ హీరోకి ఓ రేంజ్ లో ఫాలోయింగ్ పెరిగింది. అయితే కొన్నేళ్లుగా విజయ్ కి కాలం కలిసి రావడం లేదు. వరుస ప్లాపులతో సతమవుతున్నాడు. ఫ్యామిలీ స్టార్ తో హిట్ కొండదామనుకుంటే అది కూడా నిరాశపరిచింది.

Also Read: Kalki 2898 AD: కల్కి కి దీపికా పదుకొనె ప్లస్సా? మైనస్సా? తేడా కొడితే అంతే!

అందుకే విజయ్ దేవరకొండ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అది కూడా ఇంట్లో వాళ్ల ఒత్తిడి వల్ల అట. విజయ్ ఎంత ప్రయత్నించినా హిట్ ట్రాక్ ఎక్కలేకపోతున్నాడు. అతని కెరీర్ గురించి ఆందోళన పడుతున్న పేరెంట్స్ విజయ్ జాతకం చూపించారట. ఈ క్రమంలో పేరులో మార్పులు చేసుకోవాలని వారు సూచించారట. అలాంటి వాటిపై నమ్మకం లేకపోయినా తన తల్లి కోసం పేరు మార్చుకోవడానికి ఒప్పుకున్నారట.

Also Read: Kannappa: కన్నప్ప సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తారా..?

అమ్మ అంటే విజయ్ కి ఎంతో ప్రేమ అట. అందుకే ఆమె సంతోషం కోసం ఇష్టం లేకపోయినా పేరు మార్చుకోవడనికి సిద్ధం అయ్యారట. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. నిజంగా విజయ్ దేవరకొండ పేరు మార్చుకోబోతున్నారా .. లేక ఇది ఫేక్ న్యూసా అన్నది చూడాలి. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా మెప్పించనున్నాడు.