https://oktelugu.com/

Kannappa: కన్నప్ప సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తారా..?

Kannappa: ప్రభాస్ కూడా ఈ సినిమాలో ఒక 5 నిమిషాల క్యారెక్టర్ ని పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన క్యారెక్టర్ కి సంబంధించిన షూటింగ్ కూడా రీసెంట్ గా ఫినిష్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : June 12, 2024 / 12:02 PM IST

    Will Bollywood audience accept Kannappa movie

    Follow us on

    Kannappa: మోహన్ బాబు కొడుకు అయిన మంచు విష్ణు కన్నప్ప అనే సినిమాని చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం మంచు విష్ణు దాదాపు 150 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే 15 కోట్ల మార్కెట్ కూడా లేని విష్ణు 150 కోట్లు బడ్జెట్ పెట్టడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో పాన్ ఇండియాలో ఉన్న టాప్ ఆర్టిస్టులను ఇన్వాల్వ్ చేస్తున్నాడు.

    ప్రభాస్ కూడా ఈ సినిమాలో ఒక 5 నిమిషాల క్యారెక్టర్ ని పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన క్యారెక్టర్ కి సంబంధించిన షూటింగ్ కూడా రీసెంట్ గా ఫినిష్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే విష్ణు ఈ సినిమాతో భారీ కంబ్యాక్ ని ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అక్షయ్ కుమార్ ని కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం తీసుకున్నాడు. ఇక ఈ సినిమా మీద ప్రస్తుతం బాలీవుడ్ లో ఎలాంటి బజ్ అయితే లేదు.

    Also Read: Kalki 2898 AD: కల్కి కి దీపికా పదుకొనె ప్లస్సా? మైనస్సా? తేడా కొడితే అంతే!

    మరి ఈ సినిమా నుంచి టీజర్ వస్తే గాని బాలీవుడ్ లో మంచి అంచనాలైతే ఏర్పడేలా కనిపించడం లేదు. కానీ మంచు విష్ణు మాత్రం టీజర్ వచ్చాక ఈ సినిమా కోసం అందరూ ఎదురు చూస్తారు అనేంతలా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక ఈ సినిమా టీజర్ వస్తేనే సినిమా ఎలా ఉండబోతుందనేది కూడా అందరికీ తెలుస్తుంది. ఇక దాన్ని బట్టే ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతాయా లేదా తగ్గిపోతాయా అనే విషయాలైతే తెలుస్తాయి.

    Also Read: Geetha Krishna: ఇక శ్యామలకు అవకాశాలు రావు, కాళ్లపై పడాల్సిందే.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

    ఇక బాలీవుడ్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ఆది పురుషు’ సినిమాలో గ్రాఫిక్స్ గానీ, డైరెక్షన్ గానీ ఏది బాగలేకపోవడం వల్లే ఆ సినిమా ఒక భారీ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఇక ఈ సినిమా బాగుంటేనే బాలీవుడ్ జనాలు ఈ సినిమాను ఆదరిస్తారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే…