https://oktelugu.com/

ఆడిషన్స్ నిర్వహించడంపై దేవరకొండ టీమ్‌ క్లారిఫికేషన్‌

విజయ్ దేవరకొండతో కలిసి సినిమా తీస్తున్నట్లు కొన్ని నిర్మాణ సంస్థలు తప్పుగా ప్రకటనలు ఇస్తూ నటి నటులకు ఆడిషన్స్ నిర్వహిస్తున్న విషయాన్ని హీరో టీమ్ ఖండించింది. విజయ్ దేవరకొండతో సంబంధం ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా అధికారికంగా విజయ్ మరియు అతని నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తారని టీమ్‌ తెలిపింది విజయ్ పేరు చెప్పి మోసగిస్తున్న నేరస్తులపై చర్యలు చేపట్టినట్టు విజయ్ టీమ్ వెల్లడించింది. ఇలాంటి మోసగాళ్ళు పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని విజయ్ దేవరకొండ టీమ్‌కి చెందిన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : September 13, 2020 / 02:44 PM IST
    Follow us on


    విజయ్ దేవరకొండతో కలిసి సినిమా తీస్తున్నట్లు కొన్ని నిర్మాణ సంస్థలు తప్పుగా ప్రకటనలు ఇస్తూ నటి నటులకు ఆడిషన్స్ నిర్వహిస్తున్న విషయాన్ని హీరో టీమ్ ఖండించింది. విజయ్ దేవరకొండతో సంబంధం ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా అధికారికంగా విజయ్ మరియు అతని నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తారని టీమ్‌ తెలిపింది

    విజయ్ పేరు చెప్పి మోసగిస్తున్న నేరస్తులపై చర్యలు చేపట్టినట్టు విజయ్ టీమ్ వెల్లడించింది. ఇలాంటి మోసగాళ్ళు పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని విజయ్ దేవరకొండ టీమ్‌కి చెందిన అనురాగ్ పర్వతనేని ఓ అధికారిక ప్రకటనను ఇచ్చారు.

    కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనున్నారు.