ప్రపంచ దేశాల ప్రజలను ఇప్పటివరకు వైరస్ లు, బ్యాక్టీరియాలు ఇబ్బందులకు గురి చేశాయి. అయితే వాటితో పోలిస్తే కరోనా వైరస్ ప్రత్యేకం. వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినా కరోనా వైరస్ మనుషులను ఇబ్బందులకు గురి చేస్తోంది. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన అమిత్ షా ఆ తర్వాత నెగిటివ్ రావడంతో వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అయితే ఆరోగ్య సమస్యల వల్ల ఆ తర్వాత ఆయన ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.
చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జి కాగా ఆయన మరోసారి ఆస్పత్రిలో చేరారు. అమిత్ షా ఆస్పత్రిలో చేరుతుండటం బీజేపీ నేతలను కలవరపెడుతోంది. శ్వాస సంబంధిత సమస్యల వల్లే ఆయన ఆస్పత్రిలో చేరుతున్నారని తెలుస్తోంది. నిన్న రాత్రి అమిత్ షా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఎయిమ్స్ డాక్టర్లు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చికిత్సతో పాటు అమిత్ షాకు కంప్లీట్ మెడికల్ చెకప్ నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.
శ్వాస సమస్యలు, ఒళ్లు నొప్పులు తిరగబెట్టడంతో ఆయన ఆస్పత్రిలో చేరగా రెండు వారాల క్రితం అమిత్ షా డిశ్చార్జ్ అయిన సమయంలో తాము చేసిన సూచనల మేరకే ఆయన మళ్లీ ఆస్పత్రిలో చేరాడని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. అయితే పదేపదే అమిత్ షా ఆస్పత్రిలో చేరుతుండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందా…? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కరోనా నుంచి రికవరీ ఆయాక కూడా ఆయనను శ్వాస సంబంధిత సమస్యలు వెంటాడుతూ ఉండటం గమనార్హం.
మరోవైపు కరోనా నుంచి కోలుకున్న ఇతర రోగుల్లో కూడా కొన్ని అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్నా తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు చేస్తోంది. తరచూ గోరువెచ్చని నీటిని తాగుతూ, ఆయుష్ మెడిసిన్ ను వాడుతూ, తగినంత నిద్రపోవడంతో పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.