Vijay Deverakonda Rashmika Mandanna Wedding: ట్రెండ్ ను ఎవరైనా ఫాలో అవుతారు. ట్రెండును సెట్ చేసే వారికే ఒక రేంజ్ ఉంటుంది. ఈ రేంజ్ ను ఇప్పుడు ఆ ఇద్దరు క్యూట్ కపుల్స్ ఎంజాయ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా తమ పేరును అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో మారుమోగే విధంగా చేసుకున్నారు. రౌడీ బాయ్, నేషనల్ క్రష్ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టడమే కాదు.. పెళ్లంటే ఇలా చేసుకోవాలని నిరూపించారు.
Also Read: ఓరేయ్ అమీరూ.. తల ఎక్కడ పెట్టుకుంటావ్.. వీడి తిట్లే టీమిండియా కు దీవెనలు
విజయ్ దేవరకొండ.. రష్మిక మందన.. ఆమె వేలకోట్ల వసూళ్ల హీరోయిన్.. ఇతడేమో రౌడీ బాయ్.. సరిగ్గా 8 సంవత్సరాల క్రితం మనసులు కలిశాయి. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఆ ప్రేమను బహిరంగంగా ప్రకటించుకోవడంలో వారు ఏమి రహస్యాన్ని పాటించలేదు. ప్రతి సందర్భంలోనూ లీకులు ఇచ్చుకుంటూ వచ్చారు. తమకంటూ హైప్ పెంచుకున్నారు. తమ వివాహం ద్వారా సరికొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టారు.
విజయ్, రష్మిక రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ ప్రాంతంలో వివాహం చేసుకున్నారు. ఉదయపూర్ అనేది రాజుల కోట. ఇక్కడ ప్రతి అణువు లో రాజసం కనిపిస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే అక్కడ వివాహం జరిగింది. విజయ్ దేవరకొండ తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకుడు. రష్మిక కర్ణాటక రాష్ట్రంలోని కోడగు ప్రాంతానికి చెందిన పడతి. విజయ్ దేవరకొండ ది రాజుల వంశమే. రష్మికది కూడా అలాంటి నేపథ్యమే. పైగా వివాహం చేసుకొనే క్రమంలో రష్మిక వంశానికి ఆయుధాలు ధరించే సంస్కృతి ఉంది. దీని వెనక పెద్ద కథ ఉంది. స్త్రీలు ఆయుధాలు ధరించడం వల్ల వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందని.. కోడగు ప్రజల నమ్మిక.
రష్మిక నేషనల్ క్రష్ అయినప్పటికీ తన మూలాలు మర్చిపోలేదు. రౌడీ భాయ్ విజయ్ కూడా తను సూపర్ హీరో అయినప్పటికీ.. తన వంశ చరిత్రను దూరం పెట్టలేదు. సో కాల్డ్ హీరోల మాదిరిగా అనవసరమైన హంగులకు పోలేదు. ఉదయపూర్ ప్రాంతంలో రాజుల వివాహానికి వందరెట్లకి మించి తన పెళ్లిని చేసుకున్నాడు విజయ్.
రాజుల వివాహంలో మేల్ జువెలరీకి ప్రాధాన్యమిస్తారు. విజయ్ కూడా అదే స్థాయిలో ఆభరణాలు ధరించాడు. ఒకరకంగా ఆరడుగుల ఆజానుబాహుడిలాగా అతడు దర్శనమిచ్చాడు. అద్భుతమైన ఆభరణాలు ధరించి ఆకట్టుకున్నాడు. అతడు ధరించిన వస్త్రాలు రాజసానికి మించి ఉన్నాయి. రష్మిక కూడా యువరాణి లాగా మెరిసిపోయింది. వీరిద్దరి దుస్తులు రూపొందించిన డిజైనర్లు కూడా మురిసిపోయే విధంగా.. రష్మిక, విజయ్ ఆ దుస్తులలో ఒదిగిపోయారు. చివరికి రిసెప్షన్ లో కూడా విజయ్, రష్మిక మోడ్రన్ దుస్తులు ధరించలేదు. అక్కడ కూడా భారతీయతను ప్రదర్శించారు. విజయ్ ధరించిన డ్రెస్ అయితే అదిరిపోయింది. అతడు ఆ దుస్తులలో గ్రీకువీరుడు మాదిరిగా ఉన్నాడు. రష్మిక కూడా దేవకన్య లాగా దర్శనమిచ్చింది.
పెళ్లిలో రష్మిక తన సొంత ఊరు సంప్రదాయాన్ని పాటిస్తే.. విజయ్ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నాగర్ కర్నూల్ జిల్లాలోని తన సొంత గ్రామంలో నిర్వహించుకున్నాడు. అది కూడా తన సొంత ఇంట్లో జరుపుకున్నాడు. సొంత గ్రామం వారికి అద్భుతమైన విందు ఇచ్చాడు. సత్యనారాయణ స్వామి వ్రతం తర్వాత నాన్ వెజ్ ఏంటి అని చాలామంది ప్రశ్నించినప్పటికీ.. విజయ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే విజయ్, రష్మిక తమ పెళ్ళిలో ప్రతిదీ కూడా గొప్పగా ఉండేలా చేసుకున్నారు. ఇక్కడ మొదటిసారి మేల్ జువెలరీకి ప్రాధాన్యం ఇవ్వడం.. ఉదయపూర్ కోటకు సరిపడే దేహం.. ఆహార్యం.. సొంత ఊరికి ఇచ్చిన గౌరవం.. అభిమానులకు పంచిన ఆనందం.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా అద్భుతమే. విరోష్.. ఇది కేవలం 3 అక్షరాల పదం మాత్రమే కాదు.. ట్రెండ్ ను సెట్ చేసిన అద్భుతం.. విరోష్ దంపతులు కలకాలం వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఓకే తెలుగు!