Vijay Devarakonda: అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ ను కంటిన్యూ చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమాతో ఆ యాంగర్ ను కంటిన్యూ చేస్తున్నాడు. మధ్యలో ‘గీతా గోవిందం’ లాంటి క్లాస్ మూవీలో నటించినా ఆ రఫ్ లుక్ మాత్రం విజయ్ లో ఇంకా పోలేదు. ఇప్పుడు ‘లైగర్’ అంటూ ఏకంగా ప్యాన్ ఇండియా లెవల్ లో సినిమా తీసి రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక సీక్రెట్ ను రివీల్ చేసి అందరికీ షాకిచ్చాడు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక అమ్మాయితో డేటింగ్ లో ఉన్నట్టు బాంబు పేల్చాడు. కానీ తను ఫోకస్ కావడం ఇష్టం లేదని.. బయటకు తెలిస్తే ఆమె ప్రైవసీకి భంగం కలుగుతుందని భయపడుతోందని.. అందుకే ఆమె పేరు బయటకు వెల్లడించనంటూ విజయ్ దేవరకొండ జాతీయ మీడియాతో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.
Also Read: Sita Ramam Collections:’సీతా రామం’ 10th డే కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వచ్చాయంటే ?
తన వ్యక్తిగత జీవితం, సహజీవనంపై విజయ్ దేవరకొండ ఓపెన్ కావడం సంచలనమైంది. ‘నా వ్యక్తిగత సంబంధాల గురించి అందరితో చెప్పడం నాకిష్టం లేదు. నాతో రిలేషన్ లో ఉన్న వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించాలనుకోవడం లేదు. ఒక నటుడిగా పబ్లిక్ లైఫ్ లో ఉండడానికి నాకు ఇష్టం ఉన్నా.. పబ్లిక్ లో ఫోకస్ కావడం ఆమెకు నచ్చకపోవచ్చు’ అంటూ తన ప్రియురాలి పేరు బయటకు చెప్పకుండా దాచేశాడు.
ఇక విజయ్ దేవరకొండ ఈ డైలాగులు అన్నాక సోషల్ మీడియాలో అందరికీ స్పురించే పేరు ఒక్కటే. ఆమెనే ‘రష్మిక మందన్నా’. వీరిద్దరూ కలిసి రెండు మూడు సినిమాలు చేశారు. అప్పుడే పరిచయం కాస్తా బలపడిందంటారు. వీరిద్దరూ క్లోజ్ గా మూవ్ అవుతున్నారని చాలా సార్లు గాసిప్ లు వచ్చాయి. ఈ మధ్యన ముంబైలో కూడా ఈ జంట ఒకసారి సీక్రెట్ గా పార్టీలకు హాజరుకావడం చర్చనీయాంశమైంది. దీంతో రష్మికతోనే విజయ్ దేవరకొండ డేటింగ్ చేస్తున్నాడని.. స్టార్ హీరోయిన్ కాబట్టి ఇప్పుడే డేటింగ్ అంటే అవకాశాలు రావని రష్మిక కండీషన్ పెట్టి పేరు బయటకు చెప్పకుండా చేసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక లైగర్ హీరోయిన్ ‘అనన్య పాండే’తో కూడా విజయ్ క్లోజ్ గా మూవ్ అవుతున్నాడట.. ఈ మధ్య కరణ్ జోహర్ షోలో ‘విజయ్ సెక్స్ లో పాల్గొన్నాడు’ అని ఈ అమ్మడు ఓపెన్ గా చెప్పేసరికి కొంపదీసి ఈమెతోనే ఎఫైర్ నడిపిస్తున్నాడా? అని అందరూ అనుమానంగా చూశారు. బాలీవుడ్ లో ఇలాంటివి కామన్ అని.. విజయ్-అనన్య ‘లైగర్’ షూటింగ్ సందర్భంగా ప్రేమలో పడి ఉండొచ్చన్న ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. ఇవన్నీ పక్కనపెడితే విజయ్ డేటింగ్ చేస్తున్న అమ్మాయి ఎవరన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది రష్మికనే అంటున్నారు మరీ!
Also Read:Bimbisara Collections: ‘బింబిసార’ 10th డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు లాభమో తెలిస్తే ఆశ్చర్యపోతారు !