MP Gorantla Madhav Video Issue: వైసీపీలో ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్షాలు సైతం మాధవ్ వ్యవహారాన్ని ఘాటుగానే తీసుకుంటున్నాయి. దీంతో రాష్ట్రంలో మాధవ్ వీడియో పై టీడీపీ ఇప్పటికి కూడా విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉంది. మాధవ్ విషయంలో వైసీపీ అదంతా బూటకమని కొట్టిపారేస్తోంది. అందులో ఉన్నది మాధవ్ కాదని బుకాయిస్తోంది. కానీ టీడీపీ మాత్రం వైసీపీ నేతల తీరుపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. మాధవ్ నిజంగా అలా ప్రవర్తించకపోతే దానికి సంబంధించిన నిజాలు బయటపెట్టాలని సవాలు విసురుతున్నారు. దీంతో రాష్ట్రంలో మాధవ్ తీరు పార్టీకి చెడ్డపేరు తెస్తోంది. వైసీపీ నేతలు కీచకులుగా మారుతున్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.

దీనిపై అనంతపురం ఎస్పీతో వివరణ ఇప్పించినా నిజానిజాలు బయటపెడితే తప్ప నమ్మేది లేదని టీడీపీ వాదిస్తోంది. దీంతో మాధవ్ వ్యవహారం వైసీపీకి తలనొప్పిగా మారింది. టీడీపీ అధికార ప్రతినిధి మాధవ్ వీడియో అమెరికాలోని ల్యాబ్ లో పరీక్షించామని అది నూటికి నూరు శాతం ఒరిజినలే అని తేలిందని చెబుతున్నారు. దీంతో వైసీపీ ఇరకాటంలో పడుతోంది. ఆ వీడియో ఫేక్ అని వైసీపీ చెబుతుంటే అది నిజం కాదని టీడీపీ వాదిస్తోంది. దీంతో రెండు పార్టీలు పరస్పర విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నాయి.
Also Read: Pingali Chaithanya: దేశ భక్తికి విరుగుడు వ్యాక్సిన్ ఇస్తే బాగుండు

ఇప్పుడు మాధవ్ చేసింది నిజమే అని ఒప్పుకుంటే పార్టీకి నష్టమే అని తెలుస్తోంది. అందుకే వైసీపీ అదంతా బూటకమని వాదిస్తోంది. ఇప్పటికే పార్టీ పరువు పోయిన నేపథ్యంలో వైసీపీ నేతలకు ఎటూ తోచడం లేదు. టీడీపీకి మాత్రం మంచి అస్ర్తం దొరికినట్లు అయింది. దీన్ని సాకుగా చూపించి రాష్ట్రంలో వైసీపీని మైనస్ చేసేందుకు టీడీపీ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. మొత్తానికి మాధవ్ తీరుతో పార్టీకి చెడ్డపేరు వస్తోంది. ఇదంతా రాబోయే ఎన్నికల్లో పార్టీకి గుదిబండగా మారనుందని తెలుస్తోంది.
[…] […]