https://oktelugu.com/

VD 12 Update: ఒక్క పోస్టర్ తో సోషల్ మీడియాలో ప్రకంపనలు, విజయ్ దేవరకొండను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు!

విజయ్ దేవరకొండ 12వ చిత్రం నుండి సాలిడ్ అప్డేట్ విడుదల చేశారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ గూస్ బంప్స్ రేపుతోంది. గత చిత్రాలకు కంప్లీట్ డిఫరెంట్ గా VD12 లో విజయ్ దేవరకొండ లుక్ ఉంది. విజయ్ దేవరకొండ ఇంటెన్స్ లుక్స్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది.

Written By:
  • S Reddy
  • , Updated On : August 2, 2024 / 04:39 PM IST

    VD 12 Update

    Follow us on

    VD 12 Update: విజయ్ దేవరకొండకు అర్జెంట్ గా ఒక హిట్ కావాలి. ఆయన క్లీన్ బ్లాక్ బస్టర్ అందుకుని చాలా కాలం అవుతుంది. గీత గోవిందం అనంతరం విజయ్ దేవరకొండ అనేక ప్రయత్నాలు చేశారు. అవేమీ ఫలించలేదు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లైగర్ భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఫార్మ్ లోకి వచ్చిన పూరి జగన్నాధ్ లైగర్ తో బాక్సాఫీస్ కొల్లగొడతాడని ఆడియన్స్ భావించారు.

    ఎమోషన్స్ లేని స్పోర్ట్స్ డ్రామా నిరాశపరిచింది. లైగర్ విజయ్ దేవరకొండ ఇమేజ్ ని కొంత మేర డ్యామేజ్ చేసింది. ఖుషి సైతం అంచనాలు క్రియేట్ చేసింది. శివ నిర్వాణ దర్శకుడు కావడంతో ఒక మంచి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చూడబోతున్నామని ఆడియన్స్ భావించారు. విజయ్ దేవరకొండ-సమంత కెమిస్ట్రీ కొంత మేర వర్కవుట్ అయ్యింది. పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. స్వల్ప నష్టాలతో ఖుషి బయటపడింది.

    గీత గోవిందం కాంబో సెట్ కావడంతో విజయ్ దేవరకొండకు హిట్ గ్యారంటీ అనుకున్నారు. పరశురామ్ దర్శకుడిగా విజయ్ దేవరకొండ చేసిన ఫ్యామిలీ స్టార్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. వరుస పరాజయాలు ఎదురైనా… విజయ్ దేవరకొండ ఇమేజ్ చెక్కు చెదరలేదు. ఆయనకు ఆఫర్స్ తగ్గలేదు. రానున్న కాలంలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఆయన కనిపించనున్నారు. విజయ్ దేవరకొండ అప్ కమింగ్ చిత్రాల్లో VD 12 ఒకటి. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు.

    జెర్సీ చిత్రంతో గౌతమ్ తిన్ననూరి టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందారు. నాని హీరోగా తెరకెక్కిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా జెర్సీ మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. జెర్సీని హిందీలో అదే టైటిల్ తో రీమేక్ చేశారు. షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. అక్కడ మాత్రం వర్క్ అవుట్ కాలేదు. గౌతమ్ తిన్ననూరి హీరో రామ్ చరణ్ తో చేయాల్సింది. అనుకోకుండా రామ్ చరణ్-గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ రద్దు అయ్యింది.

    రామ్ చరణ్ కి చెప్పిన కథతోనే విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి మూవీ చేస్తున్నారని సమాచారం. కాగా తాజాగా విడుదలైన VD 12 పోస్టర్ అంచనాలు పెంచేసింది. డీగ్లామర్ గెటప్ లో విజయ్ దేవరకొండ సరికొత్తగా ఉన్నారు. చూస్తుంటే ఆయన ఖైదీ అన్నట్లు ఉన్నారు. హెయిర్ కట్ చేసి గడ్డం పెంచాడు. దుస్తులు జైలు యూనిఫార్మ్ ని తలపిస్తున్నాయి. VD 12 పోస్టర్ ఇంటర్నెట్ లో ప్రకంపనలు రేపుతోంది.

    సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక సమ్మర్ కానుకగా 2025 మార్చి 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే తేదీకి సల్మాన్ ఖాన్ సికందర్ విడుదలయ్యే అవకాశం కలదంటున్నారు. ఇక VD 12 పోస్టర్ షేర్ చేసిన సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దాదాపు ఆరేళ్లుగా దర్శకుడు గౌతమ్ తిన్నానూరితో జర్నీ చేస్తున్నట్లు చెప్పారు. ఆయన టాలెంట్ మీద మాకు చాలా నమ్మకం ఉంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండను ఓ రేంజ్ లో సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేస్తామన్న విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.