BSNL 5G : జియో, ఎయిర్ టెల్ కు బీఎస్ఎన్ఎల్ భారీ షాక్.. మరింత వేగంగా 5జీ సేవలు.. ఎప్పటి నుంచి అంటే..

బీఎస్ఎన్ఎల్ అతపెద్ద ముందడుగు వేయబోతోంది. ఇంకో రెండు వారాల్లో దేశ వ్యాప్తంగా 4జీ సేవలు అందించేందుకు అన్నీ సిద్ధం చేసింది. దీంతో పాటు 5జీ కూడా ట్రయల్స్ జరుపుతున్నట్లు స్పష్టం చేసింది. దీంతో జియో, ఎయిర్ టెల్ కొంచెం జంకుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Written By: NARESH, Updated On : August 2, 2024 4:47 pm
Follow us on

BSNL 5G : ఇన్నాళ్లు స్తంభంగా ఉన్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఒక్క సారిగి విజృంభించబోతోంది. బీఎస్ఎన్ఎల్ ను వెనక్కు నెడుతూ జీమో, ఎయిర్ టెల్ కస్టమర్లను ఎత్తుకెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో ఇక బీఎస్ఎన్ఎల్ మూత పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రభుత్వం దీనికి సపరేటుగా నిధులు కేటాయించింది. దీంతో మరింత వేగంతో ముందుకు కదుల నుంది. ఆగస్ట్ 15 నుంచి 4జీ సేవలను లాంచ్ చేస్తున్న సంస్థ, 5జీ ట్రయల్స్ ను కూడా చేయబోతోంది. అయితే ఇప్పటి వరకు జియో, ఎయిర్ టెల్ వెళ్లలేని గ్రామీణ, కొండ ప్రాంతాల్లో కూడా బీఎస్ఎన్ఎల్ తమ సేవలను కల్పించనుంది. ఎందుకంటే బీఎస్ఎన్ఎల్ స్ట్రాటింగ్ లోనే ఆయా గ్రామీణ ప్రాంతాలకు కేబుల్ కనెక్షన్ వేయడంతో ఇప్పుడు దీంతో సేవలు వేగంగా అందనున్నాయి. ఆగస్ట్ 15 (స్వాతంత్ర దినోత్సవం) రోజున 4జీ సేవలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. జియో, ఎయిర్ టెల్ 4జీ నుంచి 5జీ కూడా అందిస్తుండడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రభుత్వ టెలికాం కంపెనీని పరిస్థితులను మార్చగల సామర్థ్యాన్ని పొందింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ మొబైల్ టవర్‌ను ఉపయోగించి 5G సేవలను అందించనుంది. దీంతో జియో, ఎయిర్‌ టెల్‌ లో టెన్షన్ పెరుగుతోంది. బీఎస్ఎన్ఎల్ వేగంగా వాడుకలోకి వస్తే వినియోగదారులు తక్కువ ధరలో హై స్పీడ్ డేటాతో పాటు వీడియో కాల్, తదితరాలను పొందవచ్చని భావిస్తున్నారు.

ఈ నగరాల నుంచే మొదలు..
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన సొంత నెట్‌వర్క్‌ తో 5G సేవలను అందించేందుకు సిద్ధం అవుతోంది. దీని కోసం దేశీయ టెలికాం స్టార్టప్ కంపెనీ చర్చలు జరుపుతోంది. ఇందుకు ట్రయల్ సర్వీస్‌ ప్రారంభించాలని కంపెనీ అనుకుంటోంది. ఈ ట్రయల్ ఒకటి నుంచి మూడు నెలల్లో ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్ట్ కింద బీఎస్‌ఎన్‌ఎల్‌ హోల్డింగ్ 700MHz బ్యాండ్‌ను మొదట వినియోగించుకుంటుంది. ఢిల్లీ, బెంగళూర్, చెన్నై వంటి ప్రదేశాలలో 5G ట్రయల్ నిర్వహించనుంది.

ఏ ప్రదేశంలో ట్రయల్‌ విచారణ..
బీఎస్ఎన్ఎల్ నిర్వహించే 5G ట్రయల్స్ ఢిల్లీ, బెంగళూర్, చెన్నైలలోని ప్రముఖ ప్రదేశాలు..
కన్నాట్ ప్లేస్: ఢిల్లీ
ప్రభుత్వ ఇండోర్ కార్యాలయం: బెంగళూరు
ప్రభుత్వ కార్యాలయం: బెంగళూరు
సంచార్ భవన్: ఢిల్లీ
జేఎన్‌యూ క్యాంపస్: ఢిల్లీ
ఐఐటీ: ఢిల్లీ
ఇండియా హాబిటాట్ సెంటర్: ఢిల్లీ
హర్యానా: గురుగ్రామ్
ఐఐటీ: హైదరాబాద్

5G ట్రయల్‌ కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ పూర్తి మద్దతు అందిస్తుంది. ఇందుకు స్పెక్ట్రమ్, టవర్లు, బ్యాటరీలు, విద్యుత్ సప్లయ్, ఇతర సదుపాయాలు కల్పించేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది. వాయిస్ ఆఫ్ ఇండియన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎంటర్‌ప్రైజెస్ (VoICE) ప్రకారం, పబ్లిక్ వినియోగం కోసం 5G ట్రయల్స్ అందించేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది. ఈ విషయంపై బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీతో VoICE సమావేశమైంది.

VoICE అంటే?
దేశీయ టెలికాం కంపెనీల సమూహ పరిశ్రమ VoICE. ఇందులో టాటా కన్సల్టెన్సీ (TCS), VNL, తేజస్ నెట్‌వర్క్, హెచ్ఎఫ్‌సీఎల్, యునైటెడ్ టెలికాం, కోరల్ టెలికాం ఉన్నాయి. ఇవన్నీ కలిసి గ్రూపుగా ఏర్పడి బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ 5G ట్రయల్స్ జరిపేందుకు సిద్ధంగా ఉన్నాయి.

బీఎస్ఎన్ఎల్ సంస్థ కెరీర్ లో అత్యంత పెద్ద అడుగు వేయబోతోంది. ప్రభుత్వ రంగ సంస్థ అతిపెద్ద కేబుల్ నెట్ వర్క్ ఉన్న సంస్థ కావడంతో పెద్ద మొత్తంలో కస్టమర్లను చేర్చుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతో జియో, ఎయిర్ టెల్ లాంటి సంస్థలు కొంత కలవరపాటుకు గురవుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి తోడు రీసెంట్ గా రెండు కంపెనీలు వాటి టారీఫ్ లను పెంచాయి. తక్కువ టారీఫ్ లు ఉన్న బీఎస్ఎన్ఎల్ వైపునకు కస్టమర్లు వెళ్లు అవకాశం ఎక్కువగా ఉందని కార్పొరేటర్ రంగ నిపుణులు చెప్తున్నారు.