Blockbuster Movie: సినిమా ఇండస్ట్రీ సంచనాలకు నెలవు. ఒక్కోసారి ముక్కు మొహం తెలియని హీరో చేతిలో స్టార్ హీరో ఓడిపోవాల్సి రావచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా బ్లాక్ బస్టర్ కావచ్చు. ఈ సంక్రాంతికి హనుమాన్ మూవీతో అలాంటి అద్భుతం జరిగింది. బడా స్టార్స్ ని వెనక్కి నెట్టి తేజ సజ్జా సంక్రాంతి విన్నర్ అయ్యాడు. ఏకంగా రూ. 300 కోట్ల వసూళ్లు ఆ సినిమా సాధించింది. ఏది నిజంగా మిరాకిల్. తేజ సజ్జా మార్కెట్ కనీసం పదికోట్లు కూడా లేదు. ఇలాంటి సంచలనమే బాలీవుడ్ లో నమోదు అయ్యింది. 12th ఫెయిల్ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కోట్ల వసూళ్లు రాబట్టింది.
ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేకుండా కేవలం కాన్సెప్ట్ ని నమ్ముకుని 12th ఫెయిల్ తెరకెక్కించారు. వంద రోజుల రన్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర దర్శకుడు విధు వినోద్ చోప్రా మాట్లాడారు. ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. వంద కోట్లు వెయ్యి కోట్ల వసూళ్లు గురించి మాట్లాడుకునే రోజుల్లో నేను ఇలాంటి సినిమా ఎందుకు తీశాను? ఈ సినిమా తీయడం వెనుక నీ ఉద్దేశం ఏమిటీ? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.
కొందరు 12th ఫెయిల్ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేద్దాం అన్నారు. థియేటర్స్ లో దీనికి ఆదరణ దక్కదు. ఓపెనింగ్ వస్తే రెండు లక్షలు రావచ్చు. అసలు మొత్తం ముప్పై లక్షలు వసూలు చేస్తే గొప్ప అన్నారు. నేను 20 కోట్లు పెట్టి ఈ సినిమా తీశాను. అసలు ఆ డబ్బు తిరిగి వస్తుందా అని భయం వేసింది. నా సొంత డబ్బులతో మూవీ ప్రోమోట్ చేశాను. ఇప్పుడు 12th ఫెయిల్ గురించి అందరికీ తెలుసు. ఏకంగా రూ. 60 కోట్లు వసూలు చేసిందని, ఆయన అన్నారు.
12th ఫెయిల్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. బీహార్ లో పుట్టిన పేద యువకుడు మనోజ్ కుమార్ శర్మ ఎలాగైనా ఐపీఎస్ కావాలని పట్టుదలతో చదివి లక్ష్యం చేరుకున్నాడు. మనోజ్ కుమార్ శర్మ ఐపీఎస్ జీవిత కథనే 12th ఫెయిల్ మూవీ. ప్రధాన పాత్ర విక్రాంత్ మాస్సే చేశారు. గత ఏడాది అక్టోబర్ 27న 12th ఫెయిల్ విడుదలైంది. ఈ చిత్రాన్ని విమర్శకులు అద్భుత చిత్రంగా కొనియాడారు.