Prabhas: చూడగానే భారీ హైట్ తో, కొడితే నలుగురు పడిపోయే సామర్థ్యం తో ఉండి, భారీ బాడీతో దర్శనమిచ్చే ఒకే ఒక్క తెలుగు హీరో ప్రభాస్. హీరో కటౌట్ కి కరెక్ట్ ఎగ్జాంపుల్ గా ప్రభాస్ ను చెప్పవచ్చు. ఈయన తీసిన సినిమాలు మంచి విజయాలను అందుకోవడంలో ఈయన కటౌట్ కూడా చాలావరకు ముఖ్య పాత్రను పోషిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన రౌడీలను కొడుతుంటే ఆ కటౌట్ ను చూసిన అభిమానులు విపరీతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందుకే దర్శకులు ప్రభాస్ కి ఎక్కువ ఫైట్లు ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటారు.
ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ రీసెంట్ గా సలార్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు రాజాసాబ్, కల్కి సినిమాలను చేస్తున్నాడు. ఆ తర్వాత స్పిరిట్ సినిమాను కూడా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ కి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని కొన్ని సందర్భాల్లో తెలియజేశారు. అలాగే ‘ఐ లవ్ పవన్ కళ్యాణ్ ‘అని కూడా ఒకసారి స్టేజ్ మీద చెప్పడం మనందరం చూశాం.
అయితే ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా యాక్టింగ్ ని వైజాగ్ సత్యనంద్ గారి దగ్గరే నేర్చుకోవడం విశేషం. ఇక వీళ్ళిద్దరూ బ్యాచ్ మెట్స్ కానప్పటికీ సత్యానంద్ గారు వీళ్లిద్దరికి శిక్షణ ఇచ్చి సార్లుగా మలచడంలో కీలకపాత్ర వహించారనే చెప్పాలి. అలాగే పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని సినిమాలు అంటే కూడా ప్రభాస్ కి చాలా ఇష్టం అంట. ముఖ్యంగా ఖుషి సినిమా అయితే ప్రభాస్ కి విపరీతమైన ఇష్టమని ఇప్పటికే ఆ సినిమా చాలాసార్లు చూశానని కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.
ఇక మొత్తానికైతే అటు ప్రభాస్, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక వీళ్లిద్దరూ వరుసగా మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు చెరో మూడో ప్రాజెక్టులు చేస్తూ ఈ ఇయర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…