Mahesh Babu On Gunasekhar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ సెట్లు వేస్తూ సినిమాలు తీయడంలో గుణశేఖర్ ముందు వరుసలో ఉంటాడు. ఒక్కడు సినిమా కోసం చార్మినార్ లో షూటింగ్ చేయలనుకున్నారు, కానీ అక్కడ షూటింగ్ కి పర్మిషన్ రాకపోవడం తో చార్మినార్ సెట్ వేసి మరి ఆ సినిమాను తీశారు. అయితే ఈ సినిమా అప్పట్లో సూపర్ సక్సెస్ అయింది. అలాగే ఆయన సినిమాల్లో సెట్లకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది.
ఇక భారీ సెట్లు వేయడమే కాకుండా వాటిని నాచురల్ గా ఉండే విధంగా గుణశేఖర్ చక్కగా డిజైన్ చేయిస్తాడు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు తో ఒక్కడు సినిమా చేసి సూపర్ సక్సెస్ అయిన తర్వాత మళ్లీ మహేష్ బాబు తో అర్జున్ సినిమా చేశాడు. అయితే ఈ సినిమా కోసం మధురై లోని మీనాక్షి అమ్మవారి టెంపుల్ సెట్ వేయాలని చూశారు. అయితే సెట్ ఎక్కడ వేయాలి అనేది మాత్రం క్లారిటీ లేకపోవడంతో లేకుండా పోయింది.
దాంతో గుణశేఖర్ మహేష్ బాబు తో దాదాపు 70% షూటింగ్ ఈ సెట్ లోనే ఉంటుంది. కాబట్టి మనం ఈ సెట్ ను మీ స్టూడియో లో వేస్తే బాగుంటుంది అని చెప్పడంతో మహేష్ బాబు కూడా ఒకే అని పద్మాలయ స్టూడియోస్ లోనే 8 ఎకరాల్లో ఉన్న జామ తోట ని నరికేసి మరి ఈ సెట్ వేశారు. అయితే ఆ తోట ను నరికించిన విషయం కానీ, అక్కడ ఆ సెట్ వేయిస్తున్న విషయం కానీ మహేష్ బాబు కృష్ణ గారితో చెప్పలేదంట, ఇక ఆ విషయం తెలుసుకున్న కృష్ణ లొకేషన్ లోకి వచ్చి మహేష్ మీద తీవ్రంగా ఫైర్ అయ్యారంట..
మహేష్ కూడా ఏం చేయాలో తెలీక సైలెంట్ గా ఉండిపోయారట, అయితే ఈ విషయం ముందుగా కృష్ణ గారికి చెప్తే వద్దంటారనే ఉద్దేశ్యం తోనే మహేష్ బాబు కృష్ణకి చెప్పకుండా గుణశేఖర్ తో కలిసి ఈ సెట్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక అర్జున్ సినిమా రిలీజ్ అయి యావరేజ్ గా ఆడింది. ఇక మొత్తానికైతే గుణశేఖర్ చేసిన పనికి కృష్ణ కి మహేష్ కి మధ్య కొన్ని గొడవలైతే వచ్చాయి…